Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
వారానికోసారైనా మునగాకు రసం తింటే.. మందుల ముచ్చటే ఉండదు.!
పాలను మించిన పోషకాలు, పండ్ల కంటే ఎక్కువ విటమిన్లు ఒకటా రెండా.. ప్రకృతి వరం మునగాకుతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో. వారానికోసారైనా భోజనంలో మునగాకు చేర్చుకుంటే వయసుతో పాటు వచ్చే రోగాలకు మందులు వాడే అవసరమే ఉండదు. గుండెకి ఎంతో మేలు చేసే మునగాకుని రసంలా చేసుకుని తింటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.

విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే మునగాకు తినడం ద్వారా రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. ఎముకలు దృఢంగా ఉంటాయి. ఇందులోని ఫైబర్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అంతేకాకుండా ఆయుర్వేద మందుల తయారీలో మునగాకు ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. మరి ఇంత ఆరోగ్యకరమైన మునగాకుతో రసాన్ని సింపుల్‌గా ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం..
మునగాకు రసం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు
మునగాకు- ఒక కప్పు
కొత్తిమీర- పావు కప్పు
నూనె- ఒకటిన్నర టేబుల్ స్పూన్
టమాటా- రెండు
ఉల్లిపాయ- ఒకటి
పచ్చిమిర్చి- మూడు
చింతపండు- ఒక నిమ్మకాయ సైజు
ఉప్పు- ఒకటిన్నర టీస్పూన్
పసుపు- పావు టీస్పూన్
కారం- అర టీస్పూన్
అల్లం- చిన్న ముక్క
వెల్లుల్లి- నాలుగు
బెల్లం- టీస్పూన్
మిరియాలు- టీస్పూన్
జీలకర్ర- టీస్పూన్
మునగాకు రసం తయారీ విధానం
ముందుగా చింతపండును ఒక గిన్నెలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు మునగాకు, కొత్తిమీరను కడిగి మెత్తగా అయ్యేలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి వేడయ్యాక అందులో కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి వేయించాలి. ఇప్పుడు కట్ చేసిన టమాటాలు వేసి ఆయిల్‌లో మగ్గనివ్వాలి.
టమాటాలు ఉడికిన తర్వాత ఇప్పుడు అందులో మిక్సీ పట్టుకున్న కొత్తిమీర, మునగాకు పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసి కలుపుకోవాలి. ఉడికిన తర్వాత చింతపండు రసాన్ని పోసి కలిపి రసాన్ని మరగనివ్వాలి.

ఇప్పుడి మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లిని రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచుకొని మునగాకు రసంలో బెల్లంతో పాటు వేసి కాసేపు మరగనివ్వాలి. చివరిగా చిన్న పాన్‌లో మిగిలిన నూనె పోసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకుని రసంలో కలుపుకోవాలి. అంతే.. రుచికరమైన మునగాకు రసం రెడీ. వేడి వేడి అన్నంలో అప్పడాలు, వడియాలతో కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది.
ఆయుర్వేద గుణాలు ఉన్న ఈ రెసిపీని వారానికోసారి చేసుకుని తినడం మంచిది. ఇందులోని క్వెర్సెటిన్ అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచి గుండెను ఆరోగ్యంగా కాపాడుతుంది. అంతేకాకుండా ఇందులోని యాంటీఆక్సిడెంట్లు చర్మంపై ముడతలను, మచ్చలను తగ్గించడంతో పాటు జుట్టు రాలిపోకుండా కాపాడుతుంది. ఇందులోని ఫైబర్ మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications