ఎండుమిర్చి టమాటో రోటి పచ్చడి..ఇలా చేశారంటే కంచంలో వేరే కూరలు వద్దనేస్తారు!

Posted By:

కంచంలో ఎన్ని రకాల రుచికరమైన కూరలు ఉన్నాసరే తెలుగువాళ్లు పచ్చడి ఎక్కడుందా అని వెతుక్కుంటారు. పచ్చడి లేనిదే మనకు ముద్ద దిగదు. అందులోనూ రోటి పచ్చళ్లంటే మహా ఇష్టంగా ఆవురావురుమంటూ తింటారు. పచ్చళ్లందు ఎండుమిర్చి టమాటో పచ్చడి వేరు. వేడి అన్నంలోకి ఇలాంటి రోటి పచ్చడి ఒక్కటుంటే చాలు కడుపు నిండిపోతుంది. దీని రుచి అద్భుంగా ఉంటుంది. ఎండుమిర్చి టమాటో రోటి పచ్చడి మీ ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

ఎండుమిర్చి టమాటో పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు

ఆయిల్- 1 టేబుల్ స్పూన్
జీరా-1 టీస్పూన్
మెంతులు- పావు టీస్పూన్
ఎండుమిర్చి- 12
మినపప్పు- ఒకటిన్నర టీస్పూన్
టమాటోలు- 4
చింతపండు- 1 టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు- 10
రాతి ఉప్పు- అర టీస్పూన్
ఉల్లిపాయ- 1

తాలింపు కోసం:
ఆయిల్- 1 టేబుల్ స్పూన్
ఆవాలు- పావు టీస్పూన్
జీలకర్ర- పావు టీస్పూన్
పచ్చి శెనగపప్పు- అర టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు- 4
ఎండుమిర్చి- 3
ఇంగువ- చిటికెడు
కరివేపాకు- కొద్దిగా

Dry Chilli Tomato Roti Pachadi Recipe in Telugu How to Make Tasty Endumirchi Tomato Pachadi

ఎండుమిర్చి టమాటో పచ్చడి తయారీ విధానం

-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో కొంచెం నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేసి వాటిని క్రిస్పీగా(కరకరలాడేలా)వేయించాక ఈ మొత్తాన్ని ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోండి.

-తర్వాత అదే పాన్ లో మినపప్పు వేసి దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోండి.

-తర్వాత అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో టమాటో ముక్కలు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసి టమాటోలు మెత్తగా మగ్గేవరకు వేయించాలి. తర్వాత స్టవ్ ఆపేసి టమాటో ముక్కల పైతొక్కను తీసేయాలి.

ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్!

-తర్వాత రోట్లో ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి మిశ్రమం, మినపప్పు వేసి దంచుకోండి. తర్వాత ఇందులోనే మగ్గించిన టమాటోలు, వెల్లుల్లి, ఉప్పు వేసి దంచుకోండి. చివరగా ఇందులో 1 ఉల్లిపాయ వేసి కచ్చాపచ్చాగ దంచుకోండి.

-ఇప్పుడు ఈ పచ్చడికి ప్రాణం పోసే తాలింపు రెడీ చేసుకోవాలి. ఇందుకోసం స్టవ్ మీద పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి వేడయ్యాక తాలింపు గింజలు, కరివేపాకు వేసి వేగాక ఈ తాలింపులో దంచుకున్న పచ్చడి వేసి కలుపుకోండి.

-అంతే సూపర్ టేస్టీ ఎండుమిర్చి టమాటో పచ్చడి రెడీ.

[ of 5 - Users]
Story first published: Sunday, October 18, 2026, 21:46 [IST]
Desktop Bottom Promotion