దసరా స్పెషల్ నైవేద్యం చక్కెర పొంగలి..సంప్రదాయ పద్ధతిలో ఇలా చేస్తే ఇళ్లంతా డివోషనల్ వైబ్

Posted By:

చక్కెర పొంగలి..పేరు వింటేనే చాలామందికి నోట్లో నీళ్లు ఊరతాయి. సాధారణంగా పండుగలు, ప్రత్యేక రోజుల్లోనే మన ఇళ్లల్లోనే చక్కెర పొంగలిని చేస్తుంటారు. ఇవాళ దసరా పండుగ సందర్భంగా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది. చక్కెర పొంగలి చేయగానే ఇళ్లంతా ఒక ఆధ్యాత్మిక శోభ వచ్చేస్తుంది. తీపి, బియ్యం, నెయ్యితో కలిసిన ఒక అద్భుతం ఇది. నవరాత్రుల ఉపవాసాల తర్వాత లేదా పూజ సమయాలలో ఈ ప్రసాదం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నైవేద్యంగా నివేదించడనికి సంప్రదాయ పద్దతితో చక్కెర పొంగలి ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు

-పెసరపప్పు
-బియ్యం
-ఎండుకొబ్బరి
-చక్కెర
-బెల్లం
-డ్రై ఫ్రూట్స్
-యాలకల పొడి
-నెయ్యి
-పచ్చ కర్పూరం

Dussehra 2026 speical naivedyam traditional style chakkara pongal recipe in telugu

తయారీ విధానం

-ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో పావు కప్పు పెసరపప్పు వేసి దోరగా వేయించుకోండి.

-తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో వేయించిన పెసరపప్పు, ముప్పావు కప్పు బియ్యం వేసి రెండు సార్లు నీళ్లు పోసి శుభ్రంగా కడగాలి. తర్వాత అందులో రెండున్నర కప్పుల నీళ్లు పోసి మూతపెట్టి 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి.

-తర్వాత స్టవ్ ఆపేయండి. విజిల్స్ వచ్చి, ఆవిరి పోయాక మూత తీసి చూస్తే అన్నం మెత్తగా ఉడికి ఉంటది. దీన్ని గరిటతో లేదా పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోండి. దీన్ని పక్కన ఉంచుకోండి.

-తర్వాత స్టవ్ మీద వెడల్పాటి, అడుగు మందంగా ఉండే గిన్నె పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడయ్యాక అందులో ఎండు కొబ్బరి ముక్కలు వేసి సగం వరకు వేగిన తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్(జీడిపప్పు, బాదం వంటివి)వేసి వేయించి వీటన్నింటిని ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోండి.

దసరా స్పెషల్ కట్టె పొంగలి..ఇలా చేస్తే చల్లారినా కూడా గట్టిగా మద్ద అవ్వదు!

-ఇప్పుడు స్టవ్ మీద ఉన్న అదే గిన్నెలో ముప్పావు కప్పు బెల్లం లేదా బెల్లం తరుము, ముప్పావు కప్పు చక్కెర, పావు కప్పు నీళ్లు పోసి ఉడికించాలి. బెల్లం, చక్కెర కరిగిన తర్వాత వడపోసుకోవాలి.

-వడపోసుకున్న బెల్లం చక్కెర మిశ్రమం ఒక్క పొంగు వచ్చాక అందులో ముందుగా ఉడికించుకున్న అన్నం పెసరపప్పు మిశ్రమం వేసి అంతా కలిసేలా బాగా కలిపి మధ్యమధ్యలో కలుపుకుంటూ ఉడికించాలి.

-సరైన కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆపేయండి. వెంటనే అందులో వేయించి పెట్టుకన్న డ్రై ఫ్రూట్స్, ఎండుకొబ్బరి ముక్కలు, పావు టీస్పూన్ యాలకల పొడి, చిటికెడు పచ్చ కర్పూరం వేసుకొని ఒక్కసారి అంతా కలిసేలా కలుపుకోండి. చివరగా అందులో కొంచెం నెయ్యి వేసి కలుపుకుంటే చక్కెర పొంగలి రెడీ.

[ of 5 - Users]
Story first published: Tuesday, October 20, 2026, 10:09 [IST]
Desktop Bottom Promotion