Latest Updates
-
గోధుమ రవ్వ vs బొంబాయి రవ్వ..షుగర్ పేషెంట్ల ఆరోగ్యానికి ఏ ఉప్మా మంచిది? -
మిగిలిపోయిన అన్నంతో హోటల్ స్టైల్ క్రిస్పీ వడలు.. -
కర్ణాటక స్పెషల్ మసాలా చిత్రాన్నం..కేక ఉంటది ట్రై చెయ్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ -
సొంత డబ్బులతో స్కూల్ అభివృద్ధి చేసిన హెడ్ మాస్టర్..నోటీస్ పంపి,ట్రాన్స్ ఫర్ చేసిన గవర్నమెంట్! -
ఎండుమిర్చి టమాటో రోటి పచ్చడి..ఇలా చేశారంటే కంచంలో వేరే కూరలు వద్దనేస్తారు! -
ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! -
రాత్రి మిగిలిపోయిన అన్నంతో క్రిస్పీ దోశ..ఈజీగా చేసుకోండిలా.. -
పడుకునే ముందు నెయ్యితో పాదాలకు మసాజ్ చేస్తే ఏమవుతుందో తెలుసా? -
దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు -
బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది?
దసరా స్పెషల్..పాకం పట్టే పనిలేకుండా ఈజీగా బెల్లం గవ్వలు చేసుకోండిలా..గుల్ల గుల్లగా భలే రుచిగా..
దసరా వచ్చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 20న విజయదశమి పండును జరుపుకుంటాం. అయితే పండుగ సమయాల్లో లేదా ప్రత్యేకమైన రోజుల్లో మన ఇళ్లల్లో తీపి వంటకాలు తయారుచేస్తుంటారు. ఇప్పుడంటే రకరకాల వెరైటీ తీపి వంటకాలు, స్వీట్స్ చేస్తున్నారు కానీ ఒకప్పుడు బెల్లం గవ్వలను పండుగ సమయాల్లో ఎక్కువగా చేసేవాళ్లు.
క్రిస్పీగా, తియ్యగా ఉండే వీటిని తింటుంటే ఏదో తెలియని అద్భుతమైన ఫీలింగ్ ఉంటుంది. సాయంత్రం టీ టైంలో స్నాక్ గా కూడా తినడానికి ఇది బెస్ట్ ఆప్షన్. అయితే పాకం పట్టే పనిలేకుండా చాలా ఈజీగా బెల్లం గవ్వలు ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

బెల్లం గవ్వలు తయారీకి కావాల్సిన పదార్థాలు
-మైదా పిండి
-బొంబాయి రవ్వ
-వంట సోడా
-ఉప్పు
-నూనె
-నెయ్యి
-బెల్లం
కర్ణాటక స్పెషల్ మసాలా చిత్రాన్నం..కేక ఉంటది ట్రై చెయ్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్
బెల్లం గవ్వలు తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకోండి. అందులో 1 కప్పు(300గ్రా)మైదా పిండి, పావు కప్పు బొంబాయి రవ్వ, పావు టీస్పూన్ వంట సోడా, చిటికెడు ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోండి. తర్వాత అందులో పావు కప్పు వరకు నీళ్లను కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని ముద్దలా కలుపుకుని దీనిపై మూతపెట్టి 15 నిమిషాలు వదిలేయండి. పిండి ముద్ద మరీ పల్చగా కాకుండా, మరీ మందంగా కాకుండా సెమీ సాఫ్ట్ గా ఉండాలి.
-15 నిమిషాల తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఉండల్లా చేసుకోండి.
-తర్వాత గవ్వల చెక్క తీసుకోండి. లేదా మామూలు చెక్క అయినా తీసుకొని దానిమీద పిండి ఉండను పెట్టి దానిమీద బొట్టనవేలు పెట్టి అదుముతూ ముందుకు ప్రెస్ చేస్తే గవ్వల షేపులో వస్తుంది. గవ్వలన్నీ ఇలా వత్తుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి మీడియంగా వేడయ్యాక అందులో గవ్వలు వేసి 2 నిమిషాలు వదిలేస్తే వాతంట అవే పైకొస్తాయి. అప్పడు మధ్యమధ్యలో జాలి గరిటెతో కలుపుతూ మంచి బంగారు వర్ణంలోకి వచ్చేదాకా వేయించాక తీసి ప్లేట్ లో వేసుకోండి. మిగిలిన గవ్వలను కూడా ఇలాగే వేయించుకోండి.
-తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి అందులో అరకప్పు బెల్లం వేసి అందులో 1 టేబుల్ స్పూన్ నీళ్లు వేసి బెల్లాన్ని కరగనిస్తే చాలు, పాకం రానక్కర్లేదు.
-బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలుపుకున్నాక స్టవ్ ఆపేయండి.
-ఇప్పుడు ఆ బెల్లం మిశ్రమంలో వేయించుకున్న గవలన్నీ వేసి బాగా కలిసేలా గరిటతో 2 నిమిషాలు కలుపుకోండి.
-తర్వాత ఒక ప్లేట్ లోకి వీటిని తీసుకొని 10 నిమిషాలు ఆరబెడితే అవి పొడి పొడిగా వస్తాయి.
-అంతే బెల్లం గవ్వలు రెడీ. వీటిని తింటుంటే అబ్బా సూపర్ అనాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
