Latest Updates
-
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
దసరా స్పెషల్ స్నాక్.. కరకరలాడే కారం బూందీ ఎలా చేసుకోవాలంటే?
దసరా రోజు ముక్క, చుక్కతో పాటు సాయంత్రం పూట పంటి కింద నమిలేందుకు.. కరకరలాడే కారం బూందీ ఉండాల్సిందే. పండక్కని ఇంటికెళ్లిన పిల్లలకు మళ్ళీ స్కూళ్లకు, హాస్టళ్లకు పంపించేప్పుడు బూందీని ఇచ్చి పాముపాల్సిందే. అలాంటి కారం బూందీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి. కరకరలాడే విధంగా, కమ్మగా బూందీ తయారు చేసుకోవటానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం
కారం బూందీకి కావాల్సిన పదార్థాలు
> 200 గ్రాముల శనగ పిండి
> 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ
> పావు కప్పు పల్లీలు
> డీప్ ఫ్రైకి సరిపడా నూనె
> రుచికి సరిపడా ఉప్పుతో పాటు, కొద్దిగా నల్ల ఉప్పు,
> పావు కప్పు జీడిపప్పు
> 5 రెబ్బలు కరివేపాకు
> పావు టీ స్పూన్ చాట్ మసాలా
> అలాగే రెండు గ్లాసుల నీళ్లు
ఇవి కరకరలాడే కారం బూందీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు కారం బూందీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

తయారీ విధానం:
కారం బూందీ తయారు చేసుకోవడానికి ముందుగా.. శనగ పిండి తీసుకొని, దానిని జల్లెడ పట్టుకోవాలి. అనంతరం మనం తీసుకున్న బొంబాయి రవ్వను మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు జల్లెడ పట్టుకున్న శనగపిండిలో.. బొంబాయి రవ్వ కలుపుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని, కొద్దీ కొద్దిగా నీళ్లు పోసుకుంటూ.. గడ్డలు గడ్డలు లేకుండా కలుపుకోవాలి. (ఒకవేళ పిండి సరిగ్గా కలుపుకోలేకపోయినా, గడ్డలు గడ్డలు ఉన్నా.. బూందీ అనేది సరిగ్గా రాదు.)
ఈ పిండిని కలుపుకోవడానికి ముందే.. స్టవ్ ఆన్ చేసి.. బూందీ ఫ్రై చేసుకోవడానికి తగినంత నూనెను పోసి వేడిచేసుకోవాలి. నూనె బాగా మరిగినాక.. నూనెకు రెండు అంగుళాల దూరంలో ఓ జల్లి గిన్నెను పెట్టి, దానిపై బూందీ పిండిని పోయాలి. ఆ తరువాత ఆ పిండిని గరిటతో మెలిగా తిప్పుతుంటే బూందీ నూనెలోకి పడిపోతుంది.
ఇలా నూనెలో పడిన బూందీ.. లేత గోధుమ రంగులోకి రాగానే కడాయి నుంచి తీసేసి వేరే పాత్రలో తీసుకోవాలి. ఇప్పుడు అదే వేడెక్కిన కడాయిలో.. పల్లీలు వేసి ఎర్రగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. అలాగే జీడిపప్పు, కరివేపాకులు కూడా వేయించుకొని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అనంతరం పల్లీలు, జీడిపప్పులో.. కారం, కొద్దిగా నల్ల ఉప్పు, చాట్ మసాలా, సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బూందిలో వేసి.. మిక్స్ చేస్తే సరిపోతుంది. కరకరలాడే కారం బూందీ సిద్ధమైపోతుంది.
ఆ బూందీని మందులో నంచుకోవడానికి, టీ తాగేటప్పుడు తినడానికి, పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు.. పిల్లకు వేస్తే ఏం చక్కా లొట్టలేసుకుని తింటారు. ఈ పండక్కి మీరు కూడా ఈ కారం బూందీని తయారు చేసుకొని తినండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి ఈ రెసిపీని షేర్ చేయండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
