Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
పొడిపొడిగా,టేస్టీగా రాగి సేమియా పులావ్..రుచితో పాటు ఆరోగ్యం..ఎలా చేసుకోవాలంటే
రాగులు లేదా రాగి పిండి ఉపయోగించి చేసే ఏ వంటకమైనా ఆరోగ్యానికి బోలెడు మేలు చేస్తుంది.రాగి అనేది ప్రాచీన కాలం నుండి భారతదేశంలో పండిస్తున్న ఒక ధాన్యం. దీనిని 'సూపర్ ఫుడ్' అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇందులో ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే మీరు ఇప్పటిదాకా అనేక రకాల పులావ్ లు తిని ఉంటారు కానీ రాగి పులావ్ ఎప్పుడైనా తిన్నారా?రాగి సేమియా పులావ్ అనేది రుచికరమైన,ఆరోగ్యకరమైన వంటకం. ఇది సంప్రదాయ వంటకాలకు ఒక కొత్త రుచిని జోడిస్తుంది. దీనిని ఉదయం అల్పాహారంగా, మధ్యాహ్న భోజనంగా లేదా రాత్రి తేలికపాటి ఆహారంగా తీసుకోవచ్చు. ఈ పులావ్ పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ నచ్చేలా ఉంటుంది. రాగి పులావ్ ని మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేపుకోవాలో ఇక్కడ చూడండి.
రాగి సేమియా పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-రాగి సేమియా: 1 కప్పు (200 గ్రాములు)
-నీరు: 2 కప్పులు
-నూనె/నెయ్యి: 2 టేబుల్‌స్పూన్లు
-ఆవాలు: 1/2 టీస్పూన్
-శెనగపప్పు: 1 టీస్పూన్
-మినపప్పు: 1 టీస్పూన్
-వేరుశెనగలు: 2 టేబుల్‌స్పూన్లు
-పచ్చిమిర్చి: 2-3
-ఉల్లిపాయ: 1
-కరివేపాకు: కొన్ని రెబ్బలు
-అల్లంవెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్
-క్యారెట్: 1
-బీన్స్: 5-6
-బఠానీలు: 1/4 కప్పు
-క్యాప్సికమ్: 1/2 కప్పు
-టొమాటో: 1/2 కప్పు
-ఉప్పు: రుచికి సరిపడా
-పసుపు: 1/4 టీస్పూన్
-గరం మసాలా: 1/2 టీస్పూన్
-నిమ్మరసం: 1 టేబుల్‌స్పూన్
-కొత్తిమీర: కొద్దిగా

తయారీ విధానం
-ముందుగా ఒక బాండీని పొయ్యి మీద పెట్టి మీడియం మంట మీద వేడి చేయండి. అందులో రాగి సేమియా వేసి నూనె లేకుండానే 2-3 నిమిషాల పాటు లేదా లేత గోధుమ రంగు వచ్చేవరకు, మంచి సువాసన వచ్చేవరకు వేయించండి. ఇది సేమియా అతుక్కోకుండా విడివిడిగా ఉండటానికి సహాయపడుతుంది.
-వేయించిన సేమియాను ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోండి.
-అదే బాండీలో 2 టేబుల్స్పూన్ల నూనె లేదా నెయ్యి వేసి వేడి చేయండి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు వేసి అవి చిటపటమన్న తర్వాత శనగపప్పు, మినపప్పు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించండి.
-వేయించిన వేరుశెనగలు వేసి ఒక నిమిషం పాటు వేయించి తీసేయండి. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి, ఉల్లిపాయలు మెత్తబడేవరకు వేయించండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు 1 నిమిషం పాటు వేయించండి.
-తర్వాత అందులో తరిగిన క్యారెట్, బీన్స్, బఠానీలు వేసి 2-3 నిమిషాలు వేయించండి. పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. కావాలనుకుంటే ఈ దశలో తరిగిన క్యాప్సికమ్, టొమాటో కూడా వేసి మరో నిమిషం పాటు వేయించండి.
-వేయించిన కూరగాయల మిశ్రమంలో 2 కప్పుల నీరు పోసి బాగా కలపండి. నీరు మరిగే వరకు మంటను పెంచండి.
-నీరు మరగడం ప్రారంభించిన తర్వాత నెమ్మదిగా వేయించిన రాగి సేమియాను వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండండి.
-మంటను తగ్గించి మూత పెట్టి 5-7 నిమిషాల పాటు లేదా సేమియా నీటిని పూర్తిగా పీల్చుకొని, మెత్తగా ఉడికే వరకు ఉడికించండి. మధ్యమధ్యలో అడుగు అంటకుండా కలుపుకుంటుండండి.
-సేమియా ఉడికిన తర్వాత కావాలంటే 1/2 టీస్పూన్ గరం మసాలా వేసి కలపండి. పొయ్యి ఆపి 5 నిమిషాలు మూత పెట్టి ఉంచండి. ఇది సేమియా పూర్తిగా ఉడకడానికి సహాయపడుతుంది.
-చివరగా నిమ్మరసం, తరిగిన కొత్తిమీర వేసి బాగా కలపండి. అంటే రాగి సేమియా పులావ్ రెడీ. వేయించిన వేరుశెనగలతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications