Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
వర్షంలో వేడివేడిగా..కరకరలాడే క్యాబేజీ రోల్స్..ఒక్కసారి రుచి చూస్తే పదేపదే కావాలంటారు
ప్రస్తుతం వర్షాలు పడుతున్న ఈ సమయంలో సాయంత్రం కాగానే మనసు ఏదైనా వేడివేడిగా, రుచికరంగా తినాలని కోరుకుంటుంది. రోజూ తినే పానీపూరి, బజ్జీలు, మంచూరియా వంటి వాటికి భిన్నంగా, ఇంట్లోనే సులభంగా చేసుకోగలిగే ఒక అద్భుతమైన స్నాక్ ఉంది. అదే కరకరలాడే క్యాబేజీ రోల్స్. పైన క్రిస్పీగా, లోపల మసాలా స్టఫింగ్ తో నోరూరించే ఈ రోల్స్ ను ఒక్కసారి రుచి చూశారంటే మీ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా పిల్లలు పదేపదే చేయమని అడుగుతారు. ఈ రుచికరమైన క్యాబేజీ రోల్స్ ను ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
క్యాబేజీ (కొన్ని పెద్ద ఆకులు)
ఉడికించి మెత్తగా చేసిన బంగాళాదుంప - 1,
శనగ పిండి - 1 కప్పు,
నూనె - వేయించడానికి సరిపడా
సన్నగా తరిగిన ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 2
టమోటా - 1
కారం - అర చెంచా
పసుపు - పావు చెంచా
గరం మసాలా - అర చెంచా
ధనియాల పొడి - అర చెంచా
జీలకర్ర పొడి - పావు చెంచా
తరిగిన కొత్తిమీర - కొద్దిగా
ఉప్పు - రుచికి సరిపడా

తయారీ విధానం
-ముందుగా ఒక పాత్రలో నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు విడదీసి పెట్టుకున్న 5-6 క్యాబేజీ ఆకులను అందులో వేసి కేవలం రెండు నిమిషాల పాటు ఉడికించి మెత్తబడ్డాక బయటకు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆకులు రోల్స్ చుట్టడానికి సులభంగా వంగుతాయి.
-ఇప్పుడు స్టఫింగ్ కోసం బాండీలో కొద్దిగా నూనె వేడిచేసి తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి. అవి వేగాక టమోటా ముక్కలు వేసి మెత్తబడే వరకు మగ్గనివ్వాలి. ఆ తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా కలపాలి. చివరగా ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంప ముద్దను, కొత్తిమీర తరుగును వేసి అన్నీ చక్కగా కలిసేలా చూసి, రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
-ఒక గిన్నెలో శనగ పిండి, జీలకర్ర పొడి, కొద్దిగా ఉప్పు, కారం వేసి, కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ బజ్జీల పిండిలా జారుగా కలుపుకోవాలి.
-ఇప్పుడు ఉడికించిన ప్రతి క్యాబేజీ ఆకు మధ్యలో కొద్దిగా మసాలా ముద్దను పెట్టి జాగ్రత్తగా రోల్ లా చుట్టుకోవాలి. బాండీలో నూనె వేడి చేసి సిద్ధం చేసుకున్న రోల్స్ ను శనగపిండి మిశ్రమంలో పూర్తిగా ముంచి, బంగారు రంగు వచ్చేవరకు మీడియం మంటపై డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే వేడివేడి, కరకరలాడే క్యాబేజీ రోల్స్ రెడీ. వీటిని టమోటా కెచప్ లేదా గ్రీన్ చట్నీతో కలిపి తింటే ఆ రుచే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications