Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
బరువు తగ్గాలనుకునేవారు ఈ దోశ తినాలి.. ఎలా చేసుకోవాలంటే?
ఈ మోడ్రన్ కాలంలో చాలా మంది బరువు తగ్గేందుకు, ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతి ఒక్కరూ డైట్ పాటిస్తూ.. జిమ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వారికి ఇష్టమైన ఆహారాన్ని వదులుకుంటున్నారు. కొందరైతే పొద్దున్న బ్రేక్ ఫాస్ట్ కూడా మానేస్తున్నారు. అయితే బరువు తగ్గాలనుకునేవారు, వారికి ఇష్టమైన బ్రేక్ ఫాస్ట్ మానకుండా, తినే విధంగా ఉండే ఒక టిఫిన్ వంటకాన్ని ఈరోజు మీకు పరిచయం చేస్తాము.
అదే.. పనీర్ బీట్‌రూట్ దోశ. ఇది తింటే ఆరోగ్యంతో పాటు బరువు కూడా సులువుగా తగ్గొచ్చు. అయితే ఈ పనీర్ బీట్‌రూట్ దోశను ఎలా చేసుకోవాలి, చేసుకునే విధానం ఏంటి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
ముందుగా ఈ పనీర్ బీట్‌రూట్ దోశ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

> దోశ పిండి
> బీట్‌రూట్
> పనీర్,
> పనీర్ సగ్గుబియ్యం
> ఉల్లిగడ్డ
> క్యారట్
> పచ్చి మిర్చి
> ఎర్రటి ఉప్పు మిరపకాయలు
> నూనె
> ధనియాల పొడి
తయారీ విధానం:
ముందుగా దోశ పిండిని కలుపుకోవాలి. అందులో బీట్‌రూట్ నుంచి వేరు చేసిన రసాన్ని కలుపుకొని.. బాగా కలుపుకోవాలి. అది కూడా బాగా సన్నగా కాకుండా దోశ వేసుకునేందుకు వీలుగా, కొంచెం టైట్‌గా కలుపుకోవాలి. తరువాత ఆ మిశ్రమాన్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి.
తరువాత స్టవ్ ఆన్ చేసి, పెనం పెట్టి.. అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అందులో సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం వేగాక.. అందులో పచ్చిమిర్చి, క్యారట్, మెత్తగా చేసుకున్న పనీర్ ముక్కలను వేసుకోవాలి.
అవన్నీ కొద్దిసేపు వేగాక.. అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. పనీర్ ముక్కలతో పాటు ఉల్లిగడ్డ ముక్కలకు కూడా మసాలా బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. గ్యాస్ ఆపే ముందు అవన్నీ బాగా కలిశాయ లేదా అనేది నిర్ధారించుకొని ఆఫ్ చేయాలి.
ఇప్పుడు.. దోశ పెంక తీసుకొని.. దానిపై కొన్ని చుక్కల నూనె పోసి పెంక మొత్తం బాగా పోసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే కలిపి పెట్టుకున్న బీట్‌రూట్ దోశ పిండిని పెంకపైన వేసి దోశ వేసుకోవాలి. దోశ ఎప్పుడైతే లేత బంగారు వర్ణంలో మారుతుందో అప్పుడు ఇంకోవైపు తిప్పి దానిపై మనం కలిపి పెట్టుకున్న పనీర్ మిశ్రమాన్ని వేసి, కొంచెం ఆయిల్ పోసి.. కొద్దిసేపు పెనం మీద ఉంచి, కిందకు దించుకోవాలి. అంతే చాలా సులభంగా, ఆరోగ్యకరమైన పనీర్ బీట్‌రూట్ దోశ సిద్ధమైనట్లే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications