Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
గుడ్డుతో ఈ కూర చేసి తినండి.. మళ్ళీ వదిలితే ఒట్టు.. లొట్టలేసుకుని తినాల్సిందే.. ఎలా తినాలంటే?
Recipes
oi-Banothu Praveen Kumar
Posted By: Banothu Praveen Kumar
మీ ఇంట్లో గుడ్లు ఉన్నాయా? ఎప్పుడూ గుడ్డును ఆమ్లెట్‌గానో, ఫ్రీగానే చేసుకొని తింటున్నారా? అయితే ఈసారి గుడ్డును ఫ్రై చేసుకొని.. కర్రీ చేసుకొని తినండి. ఇది చేసుకోవడానికి చాలా సులభంగా, తినడానికి చాలా రుచి కరంగా ఉంటుంది. ఇది చాలా సులభంగా చేసుకోవచ్చు కాబట్టి.. వంటరాని వ్యక్తులు కూడా దీనిని సులభంగా చేసుకోవచ్చు. ఇది కేవలం 15 నిమిషాల్లోనే సిద్ధమైపోతుంది. అన్నం, చపాతీ, రోటిలలో తినడానికి ఇది మంచి ఆప్షన్ అవుతుంది.
అయితే ఈ ఎగ్ గ్రేవీ కర్రీని ఎలా చేసుకోవాలి? ఈ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఎగ్ గ్రేవీ తయారీకి కావాల్సిన పదార్థాలు
- నూనె - 3 టేబుల్ స్పూన్లు
- ఆవాలు - 1/2 టేబుల్ స్పూన్లు
- సోంపు - 1 టేబుల్ స్పూన్
- ఉల్లిపాయ - 3 (సన్నగా తరిగినవి)
- కరివేపాకు - 1 కట్ట
- టొమాటోలు - 2 (సన్నగా తరిగినవి)
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
- పసుపు పొడి - 1/2 tsp
- కులంబు కారం పొడి - 1 tsp
- కారం పొడి - 1/2 tsp
- ఉప్పు - రుచికి సరిపడా
- నీరు - అవసరమైనంత
- జీలకర్ర పొడి - 1/2 tsp
- మిరియాల పొడి - 1 tsp
- గుడ్డు - 5
- కొత్తిమీర - కొద్దిగా
ఎగ్ గ్రేవీ తయారీ విధానం
- ముందుగా కోడిగుడ్లను ఉడకబెట్టి 2 ముక్కలుగా చేసి విడిగా ఉంచుకోవాలి.
- తర్వాత పొయ్యిమీద కడాయి పెట్టి అందులో నూనె పోసి వేడయ్యాక ఆవాలు, ఇంగువ వేసి తాలింపు వేయాలి.
- తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, కరివేపాకు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
- తర్వాత సన్నగా తరిగిన టొమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మెత్తగా అయ్యేవరకు వేయించాలి.
- తర్వాత పసుపు, కరివేపాకు, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి సన్న మంట మీద ఉంచి 2 నిమిషాలు తిప్పి పచ్చి వాసన పోయే వరకు ఉడకనివ్వాలి.
- తర్వాత అందులో కొన్ని నీళ్లు పోసి గిలకొట్టి నూనె విడిపోయే వరకు మరిగించాలి.
- తర్వాత అందులో జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసి కదిలించుకోవాలి. అనంతరం ఉడికించిన, ముక్కలు చేసిన గుడ్లను వేసి, అయిదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
- ఆ తర్వాత కోడిగుడ్లు వేసి 5 నిమిషాలు ఉడకబెట్టి కొత్తిమీర చల్లి తిప్పితే రుచికరమైన ఎగ్ గ్రేవీ రెడీ.
Comments
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.
[ of 5 - Users]
Story first published: Wednesday, November 6, 2024, 23:25 [IST]
Other articles published on Nov 6, 2024



Click it and Unblock the Notifications