Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
చపాతీతో ఎగ్ రోల్స్.. ఇలా చేసుకుని తింటే రుచి అదిరిపోద్దంతే!
ఉదయాన్నే పిల్లలకు మంచి రుచికరమైన అల్పాహారం అందించాలంటే కాస్త ఎక్కువ సమయం పడుతుంది. అలాగే వారిని తినిపించడం కూడా ఒక సవాలుగా మారుతుంది. ఇడ్లీ, దోశ వంటివి వారికి నచ్చవు కూడా. అందుకే ఉదయం టిఫిన్‌తో పాటు మధ్యాహ్నం లంచ్‌లో కూడా పిల్లలు ఇష్టంగా తినే ఒక వంటకం గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాం. అదే ఎగ్ రోల్. దీనిని ఉదయం అల్పాహారంగా తినిపించొచ్చు. అలాగే మధ్యాహ్నం లంచ్ బాక్స్‌లో కూడా పెట్టి పంపించొచ్చు. ఆఫీసుకు వెళ్లే వాళ్ళు కూడా తొందరగా చేసుకోవాలంటే ఈ రెసిపీని ట్రై చేయవచ్చు.
ఇది చాలా రుచికరంగా ఉండడంతో పాటు తొందరగా చేసుకునేందుకుకే వీలుగా ఉంటుంది, అదే సమయంలో ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. అయితే ఈ ఎగ్ రోల్‌ను ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? అనేది ఇక్కడ వివరించాము పూర్తిగా చదివి ట్రై చేయండి.

ఎగ్ రోల్ తయారీకి కావాల్సిన పదార్థాలు
- చపాతీ
- గుడ్డు
- సన్నగా తరిగిన ఉల్లిపాయ
- సన్నగా తరిగిన టొమాటో
- కొత్తిమీర
- కారం
- గరం మసాలా
- ధనియాల పొడి
- నూనె
- రుచికి తగినంత ఉప్పు
- గరం మసాలా
- అల్లం వెల్లుల్లి పేస్ట్
- క్యాప్సికమ్
ఎగ్ రోల్ తయారీ విధానం
ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. అందులో కొంచెం నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ పేస్ట్ ఒక 30 సెకండ్లు వేగాక అనులో చిన్న చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ తురుము వేసుకొని ఒక నిముషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తరువాత టమాటో కూడా జత చేసుకోవాలి. ఆ మిశ్రమంపై మూత పెట్టేసి ఒక మూడు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి.
మూడు నిమిషాల తరువాత అందులో కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మసాలాలు అన్ని టమాటో, ఉల్లిపాయ, క్యాప్సికం ముక్కలకు బాగా పెట్టుకున్నాక అందులో కొంచెం నీళ్లు పోసుకోవాలి. ఆ మిశ్రమాన్ని బాగా ఉడికించుకోవాలి. అందులోని నీరు మొత్తం ఆవిరై మిశ్రమం ముద్దగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర తరుగు వేసి.. స్టవ్ మీద నుంచి కడాయి దించుకుంటే ఎగ్ రోల్లో పెట్టాల్సిన కుర్మా రెడీ అయిపోతుంది.
ఇప్పుడు ముందుగానే చేసి పెట్టుకున్న చపాతీలు తీసుకోవాలి. ఒకవేళ మీకు వేడిగా కావాలనుకుంటే చపాతీలను ఓసారి వేడి చేసుకోవచ్చు. ఆ చపాతీల్లో కోడి గుడ్డును సగం చేసి ముక్కలు వేసుకోవాలి. అలాగే అందులోని కుర్మాను కూడా జత చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని రోల్ చేసుకొని ఒక రోల్ మాదిరిగా చేసుకోవాలి. ఒకవేళ కావాలనుకుంటే రోల్‌ను మరోసారి వేడి చేసుకోవచ్చు. ఆ తరువాత ఆ రోల్‌ను ఒక ప్లేట్లో తీసుకుంటే ఎగ్ రోల్ సిధమైనట్లే. దీనిని అల్లం చట్నీ లేదా కెచప్‌లతో తినొచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications