Latest Updates
-
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్‌గా ఉండొచ్చు! -
వేసవి తాపాన్ని తీర్చే చల్లని పచ్చి మామిడి ఐస్ క్రీమ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి!
చపాతీ లేదా పూరీలోకి అదిరిపోయే సైడ్ డిష్ కోసం ఆలోచిస్తున్నారా? మీ ఇంట్లో కేవలం గుడ్లు, టమాటాలు ఉంటే చాలు.. నోరూరించే ఎగ్ టమాటో గ్రేవీని క్షణాల్లో తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి రుచి చూశారంటే చికెన్, మటన్ కర్రీలను కూడా పక్కన పెట్టేస్తారు. ఈ గ్రేవీ కేవలం చపాతీ, పూరీలకే కాకుండా.. దోశ, పరాఠా,వేడి వేడి అన్నంలోకి కూడా అద్భుతంగా అమరిపోతుంది. వంట రాని వారు లేదా బ్యాచిలర్స్ కూడా ఎంతో సులభంగా, తక్కువ సమయంలో చేసుకోవచ్చు.
ఎగ్ టమాటో తయారీకి కావలసిన పదార్థాలు
నూనె - 3 టేబుల్ స్పూన్లు
ఆవాలు - 1 టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
ఉల్లిపాయ - 1
టమాటాలు - 4
పచ్చిమిర్చి - 3
కరివేపాకు - 1 రెమ్మ
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
పసుపు - పావు టీస్పూన్
కారం - ఒకటిన్నర టీస్పూన్
ధనియాల పొడి - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
గుడ్లు - 4
నీళ్లు - అర లీటరు
మిరియాల పొడి - అర టీస్పూన్
కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు
ఎగ్ టమాటో గ్రేవీ తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి కడాయి లేదా బాండీ పెట్టుకోండి. అందులో నూనె వేసి వేడి చేయండి. నూనె కాస్త వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడే వరకు వేయించండి.
-ఆవాలు వేగిన తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కలపండి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి చిటికెడు ఉప్పు, పసుపు వేసి, అవి గోల్డెన్ బ్రౌన్ మారే వరకు వేయించుకోండి.
-ఉల్లిపాయలు మెత్తబడ్డాక అందులో అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించండి. అల్లం వెల్లుల్లి గుమగుమలాడుతున్నప్పుడు.. సన్నగా తరిగిన టమాటా ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. మూతపెట్టి టమాటాలు పూర్తిగా మెత్తబడి, గుజ్జులా మారే వరకు ఉడికించండి.
-టమాటా గుజ్జు నుండి నూనె పైకి తేలుతున్న సమయంలో అందులో ధనియాల పొడి, కారం వేసి మసాలాలు మాడిపోకుండా బాగా కలపండి. ఇప్పుడు అందులో అర లీటరు నీళ్లు పోసి, గ్రేవీకి సరిపడా ఉప్పు చూసుకుని వేసి హై ఫ్లేమ్ మీద బాగా మరిగించండి.
-నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు, స్టవ్ మంటను కాస్త తగ్గించి..4 గుడ్లను ఒక్కొక్కటిగా పగలగొట్టి గ్రేవీలో నెమ్మదిగా వేయండి. గుడ్లు వేసిన వెంటనే గరిటెతో అస్సలు కలపకూడదు. ఇప్పుడు మూతపెట్టి, మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి, గుడ్లు పూర్తిగా ఉడికే వరకు సుమారు 10 నిమిషాల పాటు అలాగే ఉడకనివ్వండి.
-గుడ్లు చక్కగా ఉడికిన తర్వాత, చివరగా పైన మిరియాల పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోండి. ఇప్పుడు ఒక చెంచా తీసుకుని ఉడికిన గుడ్లను నెమ్మదిగా ముక్కలుగా చేసి, గ్రేవీలో కలిసేలా మెల్లగా కలపండి.
-అంతే నోరూరించే ఎగ్ టమాటో గ్రేవీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications

