Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఇడ్లీ,దోశల్లోకి అసోం స్టైల్ టమాటో చట్నీ..మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుంటారు
మనం రోజు టిఫిన్ లోకి ఇడ్లీ,దోశలు,బోండా,వడలను ఎక్కువగా తయారు చేసుకుంటుంటాం. వీటిల్లోకి సైడ్ డిష్ విషయంలో మాత్రం ఎప్పుడూ ఒకే రకమైన చట్నీలు, సాంబార్ తిని బోర్ కొట్టేస్తుంటుంది. ఎంత రుచికరమైన కొబ్బరి చట్నీ లేదా పల్లీల చట్నీ అయినా సరే, రోజువారీగా తింటే ఆ ఆసక్తి తగ్గిపోవడం సహజం.
ఈసారి బ్రేక్ ఫాస్ట్ లోకి సైడ్ డిష్ గా అసోం స్టైల్ టమాటా చట్నీ ట్రై చేయండి. ఈ అసోం స్టైల్ చట్నీ చూడటానికి సాధారణంగా అనిపించినా, ఇందులో వాడే మెంతులు, బిర్యానీ ఆకు దీనికి అద్భుతమైన సువాసనను అందిస్తాయి. ఈ నోరూరించే అసోం స్టైల్ టమాటో చట్నీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
పండిన టమోటాలు: 6
నూనె: 1 టేబుల్ స్పూన్
ఆవాలు: పావు టీస్పూన్
జీలకర్ర: పావు టీస్పూన్
మెంతులు: చిటికెడు
ఎండు మిర్చి: 1
బిర్యానీ ఆకు:1
పసుపు: పావు టీస్పూన్
కారం: 1 టీస్పూన్
పంచదార: అర టీస్పూన్
ఉప్పు: తగినంత
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి అందులో నూనె పోసి వేడి చేయండి. నూనె కాగాక అందులో ఆవాలు వేయండి. అవి చిటపటలాడాక జీలకర్ర, ఎండు మిరపకాయ, మెంతులు, బిర్యానీ ఆకును వేసి వేయించండి. మెంతులు, బిర్యానీ ఆకు వేయగానే వచ్చే సువాసన ఈ చట్నీకి ప్రాణం.
-పోపు వేగిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న టమోటా ముక్కలను బాండీలో వేయండి. నూనెలో టమోటాలు కాస్త మగ్గే వరకు కలపండి.
-టమోటాలు సగం ఉడికిన తర్వాత అందులో పసుపు, కారం పొడి, రుచికి సరిపడా ఉప్పు వేయండి. ఇక్కడే ఈ చట్నీ అసలు రహస్యం దాగి ఉంది, అదే పంచదార. పంచదార కూడా వేసి బాగా కలపండి.
-ఇప్పుడు మూత పెట్టి స్టవ్ మంటను తగ్గించి సుమారు 5 నుండి 10 నిమిషాల పాటు ఉడికించండి. అడుగంటకుండా మధ్యమధ్యలో గరిటెతో కలుపుతూ ఉండాలి.
-టమాటోలలోని నీరంతా ఆవిరైపోయి, గుజ్జు దగ్గరపడి, చట్నీ నుండి నూనె వేరుపడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. చివరిగా ఒకసారి ఉప్పు సరిచూసుకోండి.
-అంతే ఎంతో రుచికరమైన, ఘాటైన, కాస్త తీయని అసోం స్టైల్ టమాటో చట్నీ రెడీ. ఇది ఇడ్లీ, దోసెలకు మాత్రమే కాదు, వేడి వేడి అన్నం లేదా చపాతీలోకి కూడా అద్భుతంగా ఉంటుంది
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications