Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఉల్లిపాయ, టమాటా ఉంటే చాలు.. జస్ట్ 10 నిమిషాల్లో చపాతీల్లోకి టేస్టీ కుర్మా చేయండిలా..
ఇంట్లో వేడివేడిగా చపాతీలు చేసుకున్నప్పుడు, వాటిలోకి బంగాళదుంప మసాలా లేదా రకరకాల కూరగాయలతో వెజిటబుల్ కుర్మా చేస్తుంటాం. కానీ కొన్నిసార్లు ఇంట్లో ఎలాంటి కూరగాయలు ఉండవు. అప్పుడు చపాతీలోకి ఏం కూర చేయాలి? అని ఆలోచిస్తూ టెన్షన్ పడుతున్నారా? అయితే ఎలాంటి కూరగాయలు లేకుండా, మీ వంటగదిలో ఉండే ఉల్లిపాయలు, టమాటాలతోనే నోరూరించే ఇన్ స్టంట్ కుర్మా తయారు చేయవచ్చు. ఈ కుర్మాను కేవలం 10 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు.

ఉల్లి-టమాటా కుర్మా తయారీకి కావలసిన పదార్థాలు
వంట నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - పావు టీస్పూన్
శనగపప్పు - 2 టీస్పూన్లు
మినపపప్పు - 1 టీస్పూన్
సోంపు - పావు టీస్పూన్
ఉల్లిపాయలు - 2
పచ్చిమిర్చి - 5
కరివేపాకు - 1 రెమ్మ
టమాటా - 1
పసుపు - ఒక చిటికెడు
నీళ్లు - ఒకటిన్నర కప్పులు
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర - కొద్దిగా
వేయించిన పల్లీలు- 3 టేబుల్ స్పూన్లు
సోంపు - ముప్పావు టీస్పూన్
ఇన్ స్టంట్ చపాతీ కుర్మా తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి కడాయి లేదా పాన్ పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి.
-నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, శనగపప్పు, మినపపప్పు వేసి దోరగా, బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. పప్పులు వేగిన తర్వాత కొద్దిగా సోంపు వేసి చిటపటలాడనివ్వాలి.
-ఇప్పుడు అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయలు లేత గులాబీ రంగులోకి మారే వరకు మగ్గనివ్వాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మరో నిమిషం పాటు వేయించాలి. తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు, చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి. టమాటాలు మెత్తగా గుజ్జులా అయ్యే వరకు ఉడికించాలి.
-ఈలోపు ఒక చిన్న మిక్సీ జార్ లో పల్లీలు లేదా జీడిపప్పు, సోంపు వేసి మెత్తటి పొడిలా మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడిలో కొద్దిగా నీళ్లు పోసి, ఎలాంటి ఉండలు లేకుండా ద్రవంలా కలిపి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద మగ్గుతున్న టమాటా మిశ్రమంలో ఈ పల్లీల ద్రవాన్ని పోసి కలపాలి. దీనికి మరో ఒకటిన్నర కప్పుల నీళ్లు జతచేసి, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి కుర్మాను బాగా మరిగించాలి. పల్లీల మిశ్రమం వేశాం కాబట్టి కుర్మా త్వరగానే చిక్కబడుతుంది.
-కుర్మా మీకు కావలసినంత చిక్కబడ్డాక, పైన సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.
-అంతే ఎంతో రుచికరమైన వేడి వేడి ఉల్లి-టమాటా కుర్మా కేవలం 10 నిమిషాల్లో రెడీ. చపాతీ లేదా పూరీలతో కూడా ఈ కుర్మా బాగుంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications