Latest Updates
-
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే -
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు
ఇంట్లో ఫిష్ కట్ లెట్ తయారుచేయటం ఎలా ?
సంవత్సరంలో ఎప్పుడైనా చాలా మందికి ప్రత్యేకంగా బెంగాలీలకు చేప అత్యంత ప్రియమైనది. సాధారణంగా వారు ఇంటిలో చేప వంటకాలను ఎంతో ఇష్టంగా చేస్తూ మునిగిపోతారు. ఫిష్ కట్ లెట్ అనేది సాధారణంగా చేసుకొనే స్నాక్ రెసిపీ.
ఇక్కడ మేము సాయంత్రం స్నాక్ అయిన ఫిష్ కట్ ని సులభంగా మరియు తొందరగా ఎలా చేసుకోవాలో చెప్పుతున్నాం. మీరు కూడా ప్రయత్నించండి.
ఈ రెసిపీ మీకు మీ అతిధులకు బాగా నచ్చుతుంది. ఈ రెసిపీ పార్టీలకు కూడా ఉత్తమంగా ఉంటుంది. ఫిష్ కట్ లెట్ కి టార్టార్ డిప్ లేదా పుదీనా చెట్నీ మంచి కాంబినేషన్. ఇక్కడ ఇంటిలో సులభంగా ఫిష్ కట్ లెట్ ఎలా తయారుచేయాలో వివరంగా ఉంది.

Recipe By: పూజ గుప్త
Recipe Type: స్నాక్స్
Serves: 4
-
బంగాళాదుంపలు - అరకేజీ (కట్ చేసినవి)
సార్డినెస్ చేపలు - 2 క్యాన్స్ (కట్ చేసినవి)
తరిగిన పార్స్లీ - 4 టేబుల్ స్పూన్లు
నిమ్మ రసం - 1 స్పూన్
లేత మయోన్నైస్ - 3 టేబుల్ స్పూన్లు
కొవ్వు రహిత గ్రీకు పెరుగు - 4 టేబుల్ స్పూన్లు
సాదా పిండి - 1 టేబుల్ స్పూన్
సన్ ఫ్లవర్ ఆయిల్ - 4 స్పూన్
గ్రీన్ సలాడ్ మరియు నిమ్మ బద్దలు సర్వింగ్ కొరకు
-
1. బంగాళాదుంపలను ఉప్పు నీటిలో 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించాలి.
2. ఒక బౌల్ లో సార్డినెస్ చేప ముక్కలను కొంచెం మెత్తగా చేసుకోవాలి.
3. దీనిలో 2 స్పూన్ల తరిగిన పార్స్లీ మరియు అర నిమ్మకాయ రసం వేసి బాగా కలపాలి.
4. మరొక బౌల్ లో మిగిలిన పార్స్లీ, నిమ్మ రసం, మయోన్నైస్, పెరుగు మరియు కొంచెం మసాలా వేసి కలపాలి.
5. ఉడికిన బంగాళాదుంపలను మెత్తగా చేయాలి.
6. దీనిలో సార్డినెస్ మిశ్రమాన్ని కలపాలి.
7. ఈ చేప ముక్కలను పిండిలో దొర్లించాలి.
8. నాన్ స్టిక్ ఫ్రైయింగ్ ప్యాన్ లో నూనె పోసి చేప ముక్కలు బంగారు రంగు వచ్చేవరకు రెండు వైపులా 3-4 నిమిషాల పాటు వేగించాలి.
9. అన్ని ముక్కలను ఇదే విధంగా వేగించాలి.
10. తయారైన ఫిష్ కట్ లెట్ లను లెమన్ మయోన్నైస్, సలాడ్ మరియు నిమ్మ బద్దలతో సర్వ్ చేయాలి.
- 1. కాల్షియం-రిచ్ ఎముకలను సార్డినెస్ నుంచి తొలగించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవి తినడానికి మృదువుగా ఉంటాయి.
- సర్వింగ్ సైజు - - 1 పెద్ద కట్ లెట్
- కేలరీలు - - 287 కేలరీలు
- కొవ్వు - - 13 గ్రాములు
- కార్బోహైడ్రేట్లు - - 29 గ్రాములు
- షుగర్ - - 2 గ్రాములు
- ఆహార ఫైబర్ - - 1 గ్రాము
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
