Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
థియేటర్ లో వందలు పెట్టక్కర్లేదు..జస్ట్ 10 రూపాయల్లో ఇంట్లోనే థియేటర్ స్టైల్ పాప్ కార్న్..ఎలా చేసుకోవాలంటే..
సినిమా థియేటర్ కి వెళ్తే సినిమా చూస్తూ ఏదో ఒకటి తినాలనిపిస్తుంటది. ఆ సమయంలో ఎక్కువ మంది కోరుకునేది పాప్ కార్న్. చేతిలో పాప్‌కార్న్ బకెట్ ఉంటే ఆ కిక్కే వేరు. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ స్నాక్ లేకపోతే సినిమా అనుభవం అసంపూర్ణంగా అనిపిస్తుంది. అయితే సినిమా థియేటర్స్ లేదా మల్టీప్లెక్స్ లలో పాప్‌కార్న్ కొనాలంటే వందల రూపాయలు ఖర్చు చేయాల్సిందే.
కానీ థియేటర్ లో అమ్మే రుచితో, అంతకంటే ఆరోగ్యకరమైన పాప్ కార్న్ ను కేవలం 5 నుండి 10 రూపాయల ఖర్చుతో మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పాప్ కార్న్ తయారు చేసుకోవడానికి పెద్దగా సరుకులు కూడా అవసరం లేదు. కేవలం మూడంటే మూడు పదార్థాలు సరిపోతాయి సాయంత్రం వేళ పిల్లలకు స్నాక్ గానీ, వీకెండ్ మూవీ నైట్ కోసం గానీ ఇది బెస్ట్ ఆప్షన్. ఇంట్లోనే పాప్ కార్న్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
ఎండిన మొక్కజొన్న గింజలు (పాప్‌కార్న్ సీడ్స్): అర కప్పు
నూనె లేదా వెన్న: 3 టేబుల్ స్పూన్లు
ఉప్పు: రుచికి సరిపడా
పసుపు: చిటికెడు
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి మందపాటి అడుగు ఉన్న ఒక గిన్నెను లేదా ప్రెషర్ కుక్కర్ ను తీసుకోండి. పలచని గిన్నెలు వాడితే గింజలు మాడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మందపాటి పాత్రనే ఎంచుకోండి.
-పాత్ర వేడెక్కాక అందులో నూనె లేదా వెన్న వేయండి. నూనె తగినంత వేడిగా ఉందో లేదో తెలుసుకోవడానికి ముందుగా 2-3 మొక్కజొన్న గింజలను నూనెలో వేసి పరీక్షించండి. అవి వెంటనే చిటపటలాడుతూ పగిలితే నూనె సరైన వేడిలో ఉందని అర్థం.
-ఇప్పుడు మిగిలిన మొక్కజొన్న గింజలన్నింటినీ వేడి నూనెలో వేయండి. కావాలంటే ఈ దశలోనే ఉప్పు, చిటికెడు పసుపు వేసి కలపవచ్చు లేదా చివర్లో చల్లుకోవచ్చు. గింజలు వేసిన వెంటనే పాత్రపై మూత పెట్టండి.
-మీరు ప్రెషర్ కుక్కర్ వాడుతున్నట్లయితే మూతకు ఉండే విజిల్ తీసివేయడం మర్చిపోవద్దు. విజిల్ ఉంటే ఆవిరి బయటకు పోక కుక్కర్ పేలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి విజిల్ లేకుండానే మూత పెట్టాలి.
-మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచండి. లోపల గింజలు టప్.. టప్.. మంటూ పగులుతున్న శబ్దం మీకు వినిపిస్తుంది. గింజలు మాడిపోకుండా ఉండటానికి, అప్పుడప్పుడు కుక్కర్ హ్యాండిల్ పట్టుకుని గిన్నెను సున్నితంగా కదపండి. ఇలా చేయడం వల్ల అడుగున ఉన్న గింజలు మాడిపోవు, అన్ని గింజలు సమానంగా వేగి, పువ్వుల్లా విచ్చుకుంటాయి.
-పగిలే శబ్దం పూర్తిగా ఆగిపోయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. ఎక్కువ సేపు ఉంచితే మాడిపోతాయి. ఇప్పుడు మూత తీసి చూడండి.. గుమగుమలాడే, ఎంతో రుచికరమైన, కరకరలాడే సినిమా థియేటర్ స్టైల్ పాప్ కార్న్ రెడీ.
-మీకు ఇష్టమైతే వేడి మీదే కొంచెం కారం పొడి లేదా పెప్పర్ పౌడర్ చల్లుకుని బాగా కలపండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications