Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
ఇడ్లీ, దోశల్లోకి అద్భుతమైన రుచితో క్యారెట్ చట్నీ..దీని ముందు కొబ్బరి చట్నీ కూడా పనికిరాదు!
సాధారణంగా క్యారెట్లతో ఎక్కువగా ఫ్రై, కూర లేదా సాంబార్ లో ముక్కలుగా వేయడం చేస్తుంటాం. అప్పుడప్పుడు హల్వా కూడా చేస్తాం. కానీ క్యారెట్ తో ఎంతో రుచికరమైన చట్నీ కూడా తయారు చేయవచ్చని మీకు తెలుసా? టిఫిన్స్ లోకి నంజుకోడానికి నిత్యం రొటీన్‌గా చేసుకునే పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీలకు బోర్ కొట్టినప్పుడు ఒక్కసారి ఈ క్యారెట్ చట్నీని ప్రయత్నించి చూడండి.
చాలా మందికి, ముఖ్యంగా పిల్లలకు క్యారెట్ తినడం పెద్దగా ఇష్టం ఉండదు. కూరలో ముక్కలు వేస్తే వాటిని పక్కన పెడుతుంటారు. అలాంటి వారికి ఈ చట్నీ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. వేడి వేడి ఇడ్లీ, దోశ, ఊతప్పం లేదా గారెల్లోకి ఈ చట్నీ అద్భుతమైన కాంబినేషన్.
కావలసిన పదార్థాలు
క్యారెట్ ముక్కలు: 1 కప్పు
ఉల్లిపాయ: 1
ఎండు మిరపకాయలు: 3-4
చింతపండు: చిన్న ఉసిరికాయంత
మినపప్పు: 2 టేబుల్ స్పూన్లు
కరివేపాకు: 2 రెమ్మలు
నూనె: 2 టీస్పూన్లు
ఉప్పు: రుచికి తగినంత
తాలింపుకి నూనె: 1 టేబుల్ స్పూన్
ఆవాలు: అర టీస్పూన్
మినపప్పు: అర టీస్పూన్
ఎండు మిరపకాయ: 1
కరివేపాకు: 1 రెమ్మ
పసుపు: చిటికెడు
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి, ఒక పాన్ పెట్టుకోండి. అందులో 2 టీస్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక అందులో మినపప్పు వేసి, దోరగా రంగు మారే వరకు వేయించాలి. మినపప్పు వేయడం వల్ల చట్నీకి మంచి కమ్మదనం వస్తుంది.
-మినపప్పు వేగాక అందులో ఎండు మిరపకాయలు, కరివేపాకు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయలు పచ్చి వాసన పోయి, మెత్తబడే వరకు వేయించుకోవాలి.
-ఇప్పుడు తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, చిన్న చింతపండు ముక్కను పాన్ లో వేసి బాగా కలపాలి. మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి, పాన్‌పై మూత పెట్టాలి. క్యారెట్ ముక్కలు మెత్తగా ఉడికే వరకు సుమారు 5 నుండి 8 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి.
-క్యారెట్ ముక్కలు మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
-చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. మొదట నీళ్ళు పోయకుండా ఒకసారి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు మరియు కొద్దిగా నీరు పోసి, మెత్తని పేస్ట్ లా రుబ్బుకోవాలి. చట్నీ మరీ జారుగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా చూసుకోండి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి.
-చట్నీ రుచిని రెట్టింపు చేయడానికి తాలింపు చాలా ముఖ్యం. స్టవ్ మీద చిన్న పాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేయాలి. అందులో ఆవాలు, మినపప్పు, ఎండు మిరపకాయ, కరివేపాకు వేసి చిటపటలాడించాలి. చివరగా చిటికెడు పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ వేడి వేడి తాలింపును ముందుగా రుబ్బి పెట్టుకున్న చట్నీలో వేసి బాగా కలపాలి.
-అంతే ఎంతో రుచికరమైన, కమ్మని క్యారెట్ చట్నీ రెడీ. అన్నంలోకి కూడా ఇది చాలా బాగుంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications






