Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
పూరీ, చపాతీలోకి అదిరిపోయే స్పెషల్ చికెన్ గ్రేవీ..ప్లేట్లు ఖాళీ అవ్వాల్సిందే!
క్రిస్మస్ పండుగ వచ్చిందంటే చాలు.. ఇంటి నిండా సందడి, ఘమఘమలాడే వంటకాల వాసనలు మనసుకు ఉల్లాసాన్ని ఇస్తాయి. ముఖ్యంగా క్రిస్మస్ ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో పూరీ లేదా చపాతీతో పాటు నాన్-వెజ్ ఉండాల్సిందే. అయితే ప్రతిసారీ చేసే సాధారణ చికెన్ కూర కాకుండా, ఈసారి కాస్త కొత్తగా ట్రై చేయండి.
ఒక ప్రత్యేకమైన మసాలాను అప్పటికప్పుడు రుబ్బుకుని గ్రేవీలో కలిపితే ఆ రుచే వేరు. రుచికరమైన, హోటల్ స్టైల్ చికెన్ గ్రేవీని సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
సాంబార్ ఉల్లిపాయలు- 100 గ్రాములు
పచ్చి కొబ్బరి ముక్కలు - 3
మిరియాలు - 1 టేబుల్ స్పూన్
జీడిపప్పు - 10
గసగసాలు - 1 టీస్పూన్
సోంపు - 1 టీస్పూన్
చికెన్ - ముప్పావు కేజీ
నూనె- 3 టేబుల్ స్పూన్లు
దాల్చిన చెక్క - 2
లవంగాలు - 6
యాలకులు - 2
అనాస పువ్వు - 2
బిర్యానీ ఆకులు - 2
పెద్ద ఉల్లిపాయలు - 4
టొమాటోలు - 3
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
ధనియాల పొడి -ఒకటిన్నర టేబుల్ స్పూన్
కారం-1 టేబుల్ స్పూన్
గరం మసాలా-అర టీస్పూన్
జీలకర్ర పొడి- పావు టీస్పూన్
పసుపు- పావు టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
పచ్చిమిర్చి - 2
కొత్తిమీర - కొద్దిగా
తయారీ విధానం
-ముందుగా ఒక చిన్న గిన్నెలో జీడిపప్పు, గసగసాలను వేసి వేడి నీళ్లు పోసి 10 నిమిషాల పాటు నానబెట్టండి.
-ఆ తర్వాత మిక్సీ జార్ లో చిన్న ఉల్లిపాయలు, కొబ్బరి, మిరియాలు, సోంపు, నానబెట్టిన జీడిపప్పు-గసగసాల మిశ్రమాన్ని వేసి, కొద్దిగా నీరు పోసి మెత్తని పేస్ట్‌లా రుబ్బుకుని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి నూనె వేసి వేడి చేయండి. నూనె కాగాక అందులో బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, దాల్చిన చెక్క వేసి వేయించాక సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించాలి.
-ఉల్లిపాయ ముక్కలు మెత్తబడి బంగారు రంగులోకి వచ్చాక అందులో తరిగిన టొమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించండి. టొమాటోలు పూర్తిగా మగ్గి, నూనె పైకి తేలేంత వరకు ఉడికించాలి.
-ఇప్పుడు అందులో శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను కుక్కర్ లో వేయండి. ఇందులోనే కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, పసుపు, తగినంత ఉప్పు వేసి ముక్కలకు పట్టేలా బాగా కలపండి. మూత పెట్టి (విజిల్ లేకుండా) 5 నిమిషాల పాటు సన్నని మంటపై చికెన్ ను మగ్గనివ్వండి.
-5 నిమిషాల తర్వాత మూత తీసి, మనం ముందుగా సిద్ధం చేసుకున్న కొబ్బరి-ఉల్లిపాయ పేస్ట్ ను చికెన్ లో వేయండి. గ్రేవీకి సరిపడా నీళ్లు పోసి బాగా కలపండి. చివరగా 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర చల్లి కుక్కర్ మూత పెట్టండి. మీడియం మంటపై 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి.
-ఆవిరి పోయిన తర్వాత మూత తీసి చూస్తే.. ఘమఘమలాడే చికెన్ గ్రేవీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications