Latest Updates
-
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్!
నూడిల్స్, మంచూరియాను మరిపించే రుచి..అదిరిపోయే చిల్లీ చపాతీ ఎలా చేసుకోవాలంటే..
భారతీయ వంటగదిలో చపాతీలు ప్రధాన ఆహారం. అయితే కొన్నిసార్లు చపాతీలు మిగిలిపోతుంటాయి. వాటిని పారేయలేక, మళ్ళీ తినలేక ఇబ్బంది పడుతుంటాం. అలా మిగిలిపోయిన చపాతీలను లేదా తాజా చపాతీలను ఉపయోగించి,కేవలం 10-15 నిమిషాల్లో అద్భుతమైన స్నాక్ లేదా అల్పాహారంగా మార్చుకునే వంటకమే చిల్లీ చపాతీ.
ఇది మీ జిహ్వకు రుచిని, శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే చిల్లీ చపాతీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-చపాతీలు
-టమాటోలు
-ఆయిల్
-క్యాప్సికం
-పచ్చిమిరపకాయలు
-ఉల్లిపాయలు
-అల్లం తరుగు
-వెల్లుల్లి తరుగు
-జీలకర్ర పొడి
-మిరియాల పొడి
-ఉప్పు
-టమోటా కెచప్
-సోయా సాస్
-షెజువాన్ సాస్
-కొత్తిమీర తరుగు
తయారీ విధానం
-ముందుగా 4 చపాతీలను స్వేయర్ షేపులో కానీ లేదా మీకు నచ్చిన షేపులో కానీ ముక్కలుగా కట్ చేసుకోండి.
-తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి వేడయ్యాక అందులో 2 టీస్పూన్ల తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం, తరిగిన 2 పచ్చిమిరపకాయలు వేసి లైట్ గా వేయించాక ఇందులో 4 ఉల్లిపాయల సన్నని తరుగు వేసి మీడియం మంట మీద వేయించాలి.
-ఇదే సమయంలో మిక్సీ గిన్నెలో 4 టమాటోలను వేసి మెత్తని గుజ్జుగా చేసుకోవాలి.
-ఉల్లిపాయలు మగ్గి, రంగుమారిన తర్వాత ఇందులో రుబ్బుకున్న 4 టమాటోల గుజ్జు కూడా వేసి పచ్చివాసన పోయేంతవరకు మగ్గనివ్వాలి.
-తర్వాత అందులో 1 టీస్పూన్ జీలకర్ర పొడి, 1 టీస్పూన్ ఉప్పు, 1 టీస్పూన్ మిరియాల పొడి వేసి అన్నీ కలిసేలా కలుపుకోవాలి.
-మసాలాలన్నీ బాగా కలిసిన తర్వాత అందులో 1 టీస్పూన్ సోయా సాస్, 2 టీస్పూన్ల షెజువాన్ సాస్,2 టేబుల్ స్పూన్ టమోటా కెచప్ వేసి అన్నీ కలిసేలా కలిపాక ఇందులో కాప్సికం ముక్కలు వేసి కలుపుకోవాలి.
-ఆయిల్ పైకి తేలుతున్న సమయంలో కడాయిలో కట్ చేసి పెట్టుకున్న చపాతీ ముక్కలు వేసి మొత్తం ముక్కలకు పట్టేలా బాగా కలపాలి.
-చివరగా కొత్తిమీర తరుగు అందులో చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే చిల్లీ చపాతీ రెడీ.
-స్పైసీ,రుచికరమైన ఆహారం తిన్నప్పుడు మన మెదడులో డోపమైన్ రిలీజ్ అవుతుంది. సాయంత్రం వేళ, అలసిపోయినప్పుడు వేడివేడిగా చిల్లీ చపాతీ తినడం వల్ల ఒత్తిడి తగ్గి, మూడ్ బాగుపడుతుంది. ఇది టీ లేదా కాఫీతో తీసుకునే మంచి స్నాక్.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications