Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే!
గులాబ్ జామున్ అనే పేరు వినగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది.. నోట్లో వేసుకోగానే కరిగిపోయే తియ్యని రుచి. పండుగైనా, పెళ్లి వేడుకైనా లేదా ఇంట్లో ఏదైనా శుభకార్యమైనా ఈ డెజర్ట్ లేనిదే భోజనం పూర్తి కాదనిపిస్తుంది. కానీ, ఎప్పుడైనా ఎవరైనా మీ భోజనం ప్లేట్‌లో గులాబ్ జామున్ ను ఒక కారంగా ఉండే కూరగా వడ్డిస్తే ఎలా ఉంటుంది?

రాజస్థాన్ లో గులాబ్ జామున్ ను కేవలం స్వీట్‌గా మాత్రమే కాదు, ఘుమఘుమలాడే కర్రీగా కూడా ఎంతో ఇష్టంగా ఆరగిస్తారు. పెళ్లిళ్లలో, ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లలో ఈ వంటకానికి ఇప్పుడు విపరీతమైన క్రేజ్ పెరిగిపోతోంది. చూడటానికి ఎంతో రాయల్‌గా కనిపించే ఈ షాహీ వంటకాన్ని మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ తయారీకి కావాల్సినవి
-ఉల్లిపాయలు
-జీడిపప్పు
-నెయ్యి
-ఇంగువ
-టమోటాలు
-కారం
-ధనియాల పొడి
-పసుపు
-పెరుగు
-గులాబ్ జామున్
-పాలు

-బయట కొనుగోలు చేసిన గులాబ్ జామున్లను ముందుగా గోరువెచ్చని పాలలో కాసేపు నానబెట్టాలి.
-తర్వాత ఫ్రెష్ టమోటాలు, ఉల్లిపాయలను తీసుకుని మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
-తర్వాత ఒక గిన్నెలో కొద్దిగా పెరుగు తీసుకుని, అందులో జీడిపప్పు పేస్ట్ ను కలపాలి. ఇందులోనే కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
-ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ లేదా పాన్ పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేడి చేయాలి. నెయ్యి వేడెక్కాక జీలకర్ర, కొద్దిగా ఇంగువ వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న టమోటా-ఉల్లిపాయ పేస్ట్ ను అందులో వేసి పచ్చివాసన పోయి మసాలా నుండి నూనె పైకి తేలే వరకు సన్నని మంటపై వేయించుకోవాలి.
-టమాటా, ఉల్లిపాయ గ్రేవీ బాగా వేగిన తర్వాతే పెరుగు, జీడిపప్పు మసాలా మిశ్రమాన్ని అందులో కలపాలి.
-గ్రేవీ పూర్తిగా ఉడికిన తర్వాత, పాలలో నానబెట్టుకున్న గులాబ్ జామున్లను అందులో నెమ్మదిగా వేసి కొన్ని నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించాలి. కూరకు మరింత క్రీమీ టెక్స్చర్, రిచ్ నెస్ తీసుకురావడానికి చివరగా కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ లేదా అదనపు జీడిపప్పు పేస్ట్ ను కలుపుకోవచ్చు.
చివరగా స్టవ్ ఆపే ముందు నేతిలో వేయించిన జీడిపప్పు పలుకులు, సన్నగా తరిగిన తాజా కొత్తిమీర ఆకులతో అలంకరిస్తే.. గుమగుమలాడే రాజస్థానీ గులాబ్ జామున్ కర్రీ రెడీ.
ఈ వంటకం చూడటానికి ఎంత అద్భుతంగా ఉంటుందో, రుచిలో కూడా అంతే సాటిలేని విధంగా ఉంటుంది. రోటీ, నాన్, చపాతీ లేదా పులావ్ తో దీనిని తింటే ఆ మజానే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications