Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Beetroot salad: బరువు తగ్గడంలో గేమ్ ఛేంజర్..'బీట్ రూట్ సలాడ్' ఇలా చేసుకోండి
అలియాభట్ బాలీవుడ్ లో ప్రముఖ హీరోయిన్. అందం, అధ్భుత నటనతో మెప్పించే అలియా భట్ శాఖాహారి. అయితే నాన్ వెజ్ ని కొంతకాలం తిని మానేయడంలా కాకుండా చిన్నతనం నుంచే పూర్తిగా శాఖాహారిగా ఉంది. ఓ ఇంటర్వ్యూలో అలియా మాట్లాడుతూ..తాను జంతు ప్రేమికురాలినని, తనకు జంతువులను చంపి తినడం ఇష్టం లేదని చెప్పింది. వెజిటేరియన్ డైట్ ఆరోగ్యకరమైనదని, పర్యావరణానికి మంచిదని తాను నమ్ముతానని అలియా చెప్పారు.
అలియా భట్ కు ఇష్టమైన ఫుడ్ బీట్ రూట్ సలాడ్. బీట్‌రూట్ తక్కువ కేలరీలు,పోషకాలను కలిగి ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది, ఆకలిని తగ్గిస్తుంది. తద్వారా ఇది బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది. బీట్ రూట్ సలాడ్ ని మీరు కూడా మీ ఇంట్లో తయారు చేయాలనుకుంటున్నారా? అయితే దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

బీట్ రూట్ సలాడ్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-1 బీట్‌రూట్ (ఉడికించి తురిమినది)
-1 కప్పు పెరుగు
-బ్లాక్ పెప్పర్
-1 టీస్పూన్ చాట్ మసాలా
-చిటికెడు కొత్తిమీర తరుగు.
-1/4 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్
-ఆవాలు
-జీలకర్ర
-ఇంగువ
-కరివేపాకు
బీట్‌రూట్ సలాడ్ తయారీ విధానం
-ముందుగా బీట్ రూట్ పైన చెక్కు తీసేసి దాన్ని తరుముకోవాలి. అందులో పెరుగు వేసి బాగా కలపండి. ఇందులోనే బ్లాక్ పెప్పర్, చాట్ మసాలా, కొత్తిమీర తరుగు, ఉప్పు వేసి చెంచాతో కలపాలి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆవాలు,జీలకర్ర వేడి చేయాలి. వేడిని తగ్గించి ఇంగువ వేసి, తర్వాత కరివేపాకు వేసి కలపాలి.
-ఇప్పుడు పాన్‌లోని ఈ మొత్తం ఈ మిశ్రమాన్ని పెరుగు,బీట్ రూట్ మిశ్రమంలో వేయండి. మళ్లీ బాగా కలపాలి. బీట్‌రూట్ సలాడ్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications