Beetroot salad: బరువు తగ్గడంలో గేమ్ ఛేంజర్..'బీట్ రూట్ సలాడ్' ఇలా చేసుకోండి

Posted By:

అలియాభట్ బాలీవుడ్ లో ప్రముఖ హీరోయిన్. అందం, అధ్భుత నటనతో మెప్పించే అలియా భట్ శాఖాహారి. అయితే నాన్ వెజ్ ని కొంతకాలం తిని మానేయడంలా కాకుండా చిన్నతనం నుంచే పూర్తిగా శాఖాహారిగా ఉంది. ఓ ఇంటర్వ్యూలో అలియా మాట్లాడుతూ..తాను జంతు ప్రేమికురాలినని, తనకు జంతువులను చంపి తినడం ఇష్టం లేదని చెప్పింది. వెజిటేరియన్ డైట్ ఆరోగ్యకరమైనదని, పర్యావరణానికి మంచిదని తాను నమ్ముతానని అలియా చెప్పారు.

అలియా భట్ కు ఇష్టమైన ఫుడ్ బీట్ రూట్ సలాడ్. బీట్‌రూట్ తక్కువ కేలరీలు,పోషకాలను కలిగి ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది, ఆకలిని తగ్గిస్తుంది. తద్వారా ఇది బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది. బీట్ రూట్ సలాడ్ ని మీరు కూడా మీ ఇంట్లో తయారు చేయాలనుకుంటున్నారా? అయితే దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

gamechanger in weight loss journey how to make beetroot sald recipe in telugu

బీట్ రూట్ సలాడ్ తయారీకి కావాల్సిన పదార్థాలు

-1 బీట్‌రూట్ (ఉడికించి తురిమినది)
-1 కప్పు పెరుగు
-బ్లాక్ పెప్పర్
-1 టీస్పూన్ చాట్ మసాలా
-చిటికెడు కొత్తిమీర తరుగు.
-1/4 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్
-ఆవాలు
-జీలకర్ర
-ఇంగువ
-కరివేపాకు

బీట్‌రూట్ సలాడ్ తయారీ విధానం

-ముందుగా బీట్ రూట్ పైన చెక్కు తీసేసి దాన్ని తరుముకోవాలి. అందులో పెరుగు వేసి బాగా కలపండి. ఇందులోనే బ్లాక్ పెప్పర్, చాట్ మసాలా, కొత్తిమీర తరుగు, ఉప్పు వేసి చెంచాతో కలపాలి.

-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆవాలు,జీలకర్ర వేడి చేయాలి. వేడిని తగ్గించి ఇంగువ వేసి, తర్వాత కరివేపాకు వేసి కలపాలి.

-ఇప్పుడు పాన్‌లోని ఈ మొత్తం ఈ మిశ్రమాన్ని పెరుగు,బీట్ రూట్ మిశ్రమంలో వేయండి. మళ్లీ బాగా కలపాలి. బీట్‌రూట్ సలాడ్ రెడీ.

[ of 5 - Users]
Story first published: Sunday, January 19, 2025, 16:23 [IST]
Desktop Bottom Promotion