Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గణేశ్ చతుర్థి స్పెషల్..స్వచ్ఛమైన మోతీచూర్ లడ్డూ..స్వీట్ షాపుకి మించిన టేస్ట్ తో ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే
వినాయక చవితి సందడి మొదలైంది. ప్రతి ఊరు, ప్రతి వీధి పండుగ శోభతో కళకళలాడుతోంది. బొజ్జ గణపయ్యను కొలుచుకోవడానికి, ఆయనకు ఇష్టమైన నైవేద్యాలు సమర్పించడానికి అందరూ రెడీ అవతున్నారు. వినాయకుడికి ఉండ్రాళ్లు, కుడుములు ఎంత ఇష్టమో, లడ్డూలన్నా కూడా అంతే ప్రీతి. సాధారణంగా మనం కుడుములు వంటివి ఇంట్లో చేసి, లడ్డూలను మాత్రం బయట స్వీట్ షాపుల నుండి కొనుగోలు చేస్తాం.
మన చేతులతో తయారుచేసిన స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన మోతీచూర్ లడ్డూలను గణపతికి నైవేద్యంగా పెడితే ఆ తృప్తే వేరు. స్వీట్ షాపుల్లో దొరికే వాటికంటే రుచికరమైన మోతీచూర్ లడ్డూలను ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేయవచ్చో ఇక్కడ చూడండి.

మోతీచూర్ లడ్డూ తయారీకి కావాల్సిన పదార్థాలు
-శనగపిండి - 250 ml
-నీరు - 400 ml
-నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
-చక్కెర-అర కిలో
-నీరు - 250ml
-ఫుడ్ కలర్ (ఆరెంజ్ లేదా రెడ్) - 1 టీస్పూన్
-నెయ్యి - 4 టేబుల్ స్పూన్లు
-యాలకుల పొడి - పావు టీస్పూన్

తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నెలో శనగపిండిని తీసుకోండి. 400 ml నీటిని పిండిలో కొద్దికొద్దిగా పోస్తూ, ఉండలు లేకుండా పిండిని మృదువుగా, జారుడుగా ఉండేలా కలుపుకోవాలి. దోశ పిండి కంటే కొంచెం పల్చగా ఉంటే బూందీ ముత్యాల్లా రాలుతుంది.
-ఇప్పుడు స్టవ్‌పై కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడిచేయాలి. నూనె బాగా కాగిన తర్వాత బూందీ గరిటెను (చిల్లుల గరిటె) కడాయికి కొంచెం ఎత్తులో పట్టుకుని, సిద్ధం చేసుకున్న పిండిని దానిపై పోయాలి.
-పిండి చిన్న చిన్న ముత్యాల్లా నూనెలో పడటం మొదలవుతుంది. బూందీని ఎక్కువసేపు వేయించకూడదు, కేవలం నిమిషం పాటు వేయించి, మెత్తగా ఉండగానే తీసి ఒక ప్లేట్‌లోకి మార్చుకోవాలి.
-మరో వెడల్పాటి పాన్ లో పంచదార, 250 ml నీరు పోసి స్టవ్ మీద పెట్టండి. పంచదార పూర్తిగా కరిగి, పాకం కొద్దిగా చిక్కబడే వరకు మరగనివ్వాలి.
-ఇప్పుడు అందులో ఫుడ్ కలర్, యాలకుల పొడి, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా కలపండి.
-పాకం మరుగుతున్నప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న బూందీని అందులో వేసి బాగా కలపాలి. బూందీ పాకాన్ని పీల్చుకోవడం మొదలవుతుంది. రెండు నిమిషాల పాటు ఉడికించి, స్టవ్ ఆపివేయండి.
-పాన్ మీద మూతపెట్టి, అరగంట పాటు ఆ మిశ్రమాన్ని అలా వదిలేయండి. ఈ సమయంలో బూందీ పాకాన్ని పూర్తిగా పీల్చుకుని మెత్తగా తయారవుతుంది.
-అరగంట తర్వాత మూత తీసి చూడండి. బూందీ పాకాన్ని పీల్చుకుని లడ్డూ చుట్టడానికి సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు మరో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసి బాగా కలపండి. మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని, కొద్దికొద్దిగా మిశ్రమాన్ని తీసుకుని గుండ్రంగా లడ్డూలు చుట్టుకోవాలి. అంతే ఘుమఘుమలాడే, నోరూరించే మోతీచూర్ లడ్డూలు రెడీ.
ఈ పండుగకు ఈ లడ్డూలను వినాయకుడికి నైవేద్యంగా సమర్పించి, మీ కుటుంబ సభ్యులతో పంచుకుని ఆనందించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications