Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Mirapakaya Tea: బాడీ పెయిన్స్ తగ్గాలంటే ఈ మిరపకాయ టీ తాగాలి.. ఎలా చేసుకోవాలో తెలుసా?
టీ అనగానే అందరికీ పాలతో చేసే టీ లేదా గ్రీన్ టీ గుర్తొస్తుంది. ఇంకొందరికి బెల్లం టీ, పింక్ టీ, అల్లం టీ వంటికి యాదికొస్తుంది. అయితే చలికాలంలో తప్పక తాగాల్సిన మిరపకాయల టీ గురించి ఈ రోజు తెలుసుకుందాం. ఈ టీ తాగడం వల్ల శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది. అలాగే జీర్ణ క్రియ మెరుగ్గా పని చేస్తుంది. కీళ్ల నొప్పులు, నడుపు నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రయోజనాలను ఇది అందించనుంది. అయితే దీనిని ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మిరపకాయల టీ తయారీకి కావాల్సిన పదార్థాలు
- మిరపకాయలు
- అల్లం
- దాల్చిన చెక్క
- ఏలకులు

మిరపకాయల టీ తయారీ విధానం
ఈ మిరపకాయల టీని చాలా సులభంగా చేసుకోవచ్చు. వంట రాని వ్యక్తులు కూడా ఈ టీని ఇంట్లోనే క్షణాల్లోనే తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక పాత్ర తీసుకోవాలి. అందులో ఒక రెండు గ్లాసుల నీటిని వేసుకోవాలి. నీరు వేడయ్యాక అందులో మిరపకాయల తరుగు, అల్లం ముక్కలు, దాల్చిన చెక్క, ఏలకులు కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలి.
ఇవన్నీ బాగా మరిగి.. ఇందులోని రసం నీటిలో ఇంకిన తరువాత నీటిని వడగట్టుకొని ఒక గ్లాసులో తీసుకుంటే ఎంతో ఆరోగ్యకరమైన మిరపకాయల టీ సిద్ధమైనట్లే. దీనిని తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి.
నొప్పిని నివారిస్తుంది
మిరపకాయల్లో నొప్పిని హరించే గుణాలు ఉంటాయి. ఈ మిరపకాయల టీని తాగడం వల్ల ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు ఇతర నొప్పులు ఏమైనా ఉంటే తగ్గిపోతాయి. ప్రతిరోజూ దీనిని తాగడం వల్ల మంచి అనుభూతిని పొందడంతో పాటు నొప్పులు క్రమంగా దూరమవుతున్న అనుభూతిని అనుభవించవచ్చు.
జీర్ణ ఆరోగ్యం కోసం
మిరపకాయల టీ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా పని చేస్తుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడంతో పాటు తిన్న ఆహరం సరిగ్గా జీర్ణమవడం, ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు దూరమవుతాయి. అలాగే మీరు తిన్న ఆహారం సరైన రీతిలో శరీరానికి చేరేలా ఇది ప్రేరేపిస్తుంది. ఉబ్బరం వంటి సమస్యలను తొలగిస్తుంది. మలబద్దకం వంటి ఆరోగ్య సమస్యలు మీ చెంతకు చేరవు. మొత్తాన్ని మీ గట్ ఆరోగ్యం అద్భుతంగా మారుతుంది.
మెంటల్ హెల్త్
ఈ టీ తాగడం వల్ల శరీరానికి మేలు చేకూరడం మాత్రమే కాదు. మనసుకు కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ టీ తాగడం వల్ల ఒత్తిడి దూరమవుతుంది. అలాగే మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. దీంతో శరీరంలోని సహజమైన నొప్పులను దూరం చేస్తుంది. దీంతో మానసిక సమస్యలు దూరమవుతాయి. మీరు కూడా ఓసారి ఈ మిరపకాయల టీని ట్రై చేయండి, మార్పు గమనిస్తే మీ స్నేహితులకు రిఫర్ చేయండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications