Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
హోటల్ స్టైల్ టమాటా కారం చట్నీ..ఎంత తిన్నా తనివి తీరని టేస్ట్..20 ఇడ్లీలు అయినా అవలీలగా తినేస్తారు!
వేడి వేడి ఇడ్లీలు,వడలు.. పక్కనే ఘుమఘుమలాడే కమ్మటి చట్నీ.. ఆహా, ఈ కలయికను తలచుకుంటేనే నోరూరుతోంది కదూ? రోజూ పొద్దున్నే ఇంట్లోనే ఇడ్లీ, దోస,వడ వంటివి చేసుకున్నా మన మనసు మాత్రం ఎక్కడో హోటల్ లో తినే ఆ కారంగా, పుల్లగా, తియ్యగా ఉండే టమాటా చట్నీ వైపు లాగుతూ ఉంటుంది. ఆ చిక్కటి రంగు, ఆ ఘాటైన రుచి ఇంట్లో ఎందుకు రావడం లేదని ఎన్నోసార్లు బాధపడి ఉంటాం.
హోటల్ చెఫ్ లు వాడే ఒకే ఒక్క చిన్న చిట్కాతో, అదే అద్భుతమైన రుచిని మీ వంటింట్లోనే మీరు సృష్టించవచ్చు. ఆ సీక్రెట్ పదార్థం మనందరికీ తెలిసిన చింతపండే. ఈ రెసిపీని ఒక్కసారి ప్రయత్నించారంటే చాలు, మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని చట్నీ స్పెషలిస్ట్ అని పిలవడం ఖాయం. హోటల్ స్టైల్ టమాటా కారం చట్నీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
పెద్ద టమాటాలు - 3
ఉప్పు - రుచికి సరిపడా
జీలకర్ర పొడి - 1/4 టీస్పూన్
కరివేపాకు - ఒక రెమ్మ
నూనె - 3 టీస్పూన్లు
ఎండు మిరపకాయలు - 8
కాశ్మీరీ ఎండు మిరపకాయలు - 4
వెల్లుల్లి రెబ్బలు - 8
తాలింపు కోసం:
నువ్వుల నూనె - 1 టేబుల్ స్పూన్
ఆవాలు - 1 టీస్పూన్
మినప్పప్పు - 1 టీస్పూన్
ఎండు మిరపకాయ - 1
కరివేపాకు - ఒక రెమ్మ
తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో ఆయిల్ వేసి వేడి చెయ్యాలి.
-నూనె వేడెక్కాక అందులో వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిరపకాయలు, కాశ్మీరీ మిరపకాయలు వేసి అవి మంచి సువాసన వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి.
-ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి అవి మెత్తబడి, పారదర్శకంగా మారేంత వరకు వేయించాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు, చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.
-టమాటాలు పూర్తిగా మగ్గి, మెత్తటి గుజ్జులా మారే వరకు మూతపెట్టి మగ్గించుకోవాలి. ఈ దశలో జీలకర్ర పొడి, కరివేపాకు కూడా వేసి ఒక నిమిషం పాటు వేయించి, స్టవ్ ఆఫ్ చేయాలి. కొద్దిసేపు పక్కన పెట్టి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
-మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసి వీలైనంత వరకు నీళ్లు కలపకుండా మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు తాలింపు లేదా పోపు కోసం..స్టవ్ మీద బాండీ పెట్టి నువ్వుల నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగాక ఆవాలు, మినప్పప్పు వేయాలి. అవి చిటపటలాడాక ఎండు మిరపకాయ, కరివేపాకు వేసి వేయించాలి.
-ఈ పోపులో మనం రుబ్బి పెట్టుకున్న టమాటా చట్నీని వేసి, బాగా కలిపి, రెండు మూడు నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడికిస్తే చాలు. నూనె పైకి తేలి, చట్నీ రంగు మరింత చిక్కగా మారుతుంది. అంతే నోరూరించే, ఘుమఘుమలాడే హోటల్ స్టైల్ టమాటా కారం చట్నీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications