Latest Updates
-
ఈ రాశి వారు శుక్రవారం ఈ పూజ చేస్తే ఇంట్లో అష్టైశ్వర్యాలు కొలువుదీరడం పక్కా.! -
పులియబెట్టాల్సిన పనిలేదు.. దోశ పిండి లేకపోతే ఇన్స్టంట్గా ఈజీగా చేసుకునేలా.! -
గణేష్ పూజ తర్వాత అరుదైన లక్ష్మీ నారాయణ యోగం..వాళ్లకి స్వర్ణ యుగమే! -
కూరలో నూనె ఎక్కువైందా? రుచి మారకుండా ఇలా ఈజీగా తీసేయండి! -
ఒక్క ముద్దలో లెక్కలేనన్ని ప్రయోజనాలు.. వయసు మళ్లినవారు తప్పనిసరిగా తినాల్సిన హెల్తీ కుర్మా.! -
చర్మ అలెర్జీలకు గుడ్ బై!.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని బెస్ట్ న్యాచురల్ రెమెడీస్ ఇవే! -
పైసా లేదని పెళ్లిళ్లు చేసుకోరు, కానీ పిల్లల్ని కంటారు.. ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా.? -
తమిళుల ఆరోగ్య రహస్యం.. ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే తంజావూర్ అడై.. ఒక్కటి తిన్నా చాలు.! -
లాభ దృష్టి యోగం: సెప్టెంబర్ 15 తర్వాత ఈ నాలుగు రాశుల ఇళ్లలో ధనలక్ష్మి తిష్ట! -
కొవిడ్ ఇచ్చిన కిక్.. డిగ్రీ పట్టా లేదు, వ్యాపారం కాదు.. కానీ 20 ఏళ్లకే నెలకు రూ. లక్షల్లో ఆదాయం.!
గుంటూరు స్పెషల్ టిఫిన్స్ అల్లం పచ్చడి..ఒక్కసారి చేసుకుంటే నెల రోజులు నిల్వ!
దోశ, ఇడ్లీ, గారె, పెసరట్టులోకి మాములు చట్నీతో తింటే వచ్చే మజా కన్నా అల్లం చట్నీతో తింటే వచ్చ మజా వేరే లెవల్లో ఉంటుంది. అందులోనూ గుంటూరులో టిఫిన్ సెంటర్లలో రోడ్డు పక్కన టిఫిన్ బండ్లమీద వడ్డించే అల్లం పచ్చడికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది.
గుంటూరు ఫేమస్ టిఫిన్స్ అల్లం పచ్చడితో ఇడ్లీ, దోశలను తింటుంటే స్వర్గమే. దీనిని తయారుచేయడం చాలా చాలా ఈజీ. రెగ్యులర్ గా ఇంట్లో పదార్థాలతోనే నెల రోజుల వరకు నిల్వ ఉండేలా గుంటూరు స్పెషల్ టిఫిన్స్ అల్లం పచ్చడి ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-ధనియాలు
-పచ్చి శగనపప్పు
-నూనె
-మినపప్పు
-ఎండుమిర్చి
-చింతపండు
-అల్లం
-బెల్లం
-జీలకర్ర
-వెల్లుల్లి
-ఉప్పు
కూరలో నూనె ఎక్కువైందా? రుచి మారకుండా ఇలా ఈజీగా తీసేయండిః
తయారీ విదానం
-ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోండి. అందులో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చి శెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి తక్కువ మంట మీద ఎర్రగా, మంచి సువాసన వచ్చేదాకా వేపుకోండి.
-తర్వాత అందులోనే 50 గ్రాముల ఎండుమిరపకాయలు వేసి వేపుకోండి. ఎండుమిర్చి వేగాక అందులోనే 50 గ్రాముల అల్లం తరుగు వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాలి. తర్వాత స్టవ్ ఆపేసి ఈ మొత్తాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
-చల్లారిన తర్వాత వేయించిన మొత్తం మిక్సీ గిన్నెలో వేసుకోండి. ఇందులోనే 100 గ్రాముల బెల్లం తరుగు, 50 గ్రాముల చింతపండు చిక్కటి పులుసు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఉప్పు వేసి,వేడి వేడి నీల్లు పోసి మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
-అంతే టిఫిన్స్ అల్లం పచ్చడి రెడీ. ఏ టిఫిన్స్ తో అయినా దీన్ని అద్దుకుని తింటంటే వేరే లెవల్ మజా నోటికి లభిస్తుంది.
-చల్ల నీళ్లు పోసి రుబ్బుకుంటే పచ్చడి 4 రోజులకే పాడవుతుంది, కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వేడి నీళ్లే పోసి గ్రైండ్ చేసుకోవాలి. కాచి చల్లార్చిన నూనె కనుక పచ్చడి పైన పోసుకుంటే 4 నెలల దాకా కూడా నిల్వ ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
