Latest Updates
-
నాలికకు కిక్కిచ్చే చేప వెల్లుల్లి కారం..ఇలా చేశారంటే స్వర్గానికి బెత్తెడే దూరం! -
సమంత సీక్రెట్ ఇదే..రోజూ ఉదయం అలా చేస్తే లైఫ్ జిల్ జిల్ జిగా జిగా.. -
షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ! -
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా?
గోంగూర చికెన్ పచ్చడి ఇలా చేశారంటే..దాసోహం అవ్వాల్సిందే
మన తెలుగు వారికి ప్లేట్లో ఎన్ని రకాల కూరలు ఉన్నా సరే పచ్చడి ఎక్కడుందా అని వెతుక్కునే అలవాటు ఉంటుంది. ఒక్క ముద్ద అయినా పచ్చడితో తింటే అది పరిపూర్ణ భోజనం అనే ఫీలింగ్ ఉంటది. పచ్చళ్లల్లో గోంగూర పచ్చడిది ఎప్పుడూ ఫస్ట్ ప్లేసే. దీన్ని మించినది ఈ ప్రపంచంలోనే ఉండదు.
అలాంటి గోంగూరతో కలిపి చికెన్ పచ్చడి చేశారంటే ఇక ఏమన్నా టేస్ట్ ఉంటదా చెప్పండి..అద్దిరిపోతుందంతే. గోంగూర చికెన్ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

గోంగూర చికెన్ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు
-చికెన్
-గోంగూర
-పసుపు
-ఉప్పు
-దాల్చిన చెక్క
-యాలకలు
-లవంగాలే
-ఆవాలు
-జీలకర్ర
-మెంతులు
-ధనియాలు
-నూనె
-కారం
-మసాలా పొడి
నాలికకు కిక్కిచ్చే చేప వెల్లుల్లి కారం..ఇలా చేశారంటే స్వర్గానికి బెత్తెడే దూరం!
గోంగూర చికెన్ పచ్చడి తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో చిన్నగా కట్ చేసిన చికెన్ ముక్కలు వేసి అందులో పసుపు, ఉప్పు వేసి ముక్కలకు పట్టేలా బాగా చేతులతో కలిపాక మూతపెట్టి అరగంట సేపు పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, దాల్చిన చెక్క, యాలకలు, లవంగ మొగ్గలు వేసి మొత్తాన్ని దోరగా వేయించాక వీటన్నింటిని మిక్సీ జార్ లో వేసి మెత్తగా పొడిలా గ్రైండ్ చేసి పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఉన్న పాన్ లోనే ఆయిల్ వేసి ముందుగా శుభ్రం చేసి ఆరబెట్టుకున్న గోంగూర ఆకులను ఆ నూనెలో వేసి మెత్తగా ఉడికించుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద మరో పాన్ పెట్టి అందులో పక్కన ఉంచుకున్న చికెన్
ముక్కలు వేసి, ఇందులోనే కొంచెం నూనె వేసి చికెన్ ముక్కలలోని నీరంగా
ఇగిరిపోయేదాకా వేగించుకుని
పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు చికెన్ ను డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇందుకోసం స్టవ్ మీద బాండీ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడయ్యాక అందులో చికెన్ ముక్కలను వేసి మరీ గట్టిగా కాకుండా, మరీ మెత్తగా కాకుండా వేయించి పక్కన తీసి పెట్టుకోండి.
-ఇప్పుడు బాండీలో ఉన్న అదే నూనెలో అల్లంవెల్లుల్లి పేస్ట్, మళ్లీ చికెన్ ముక్కలు వేసి, ఇందులోనే ఉప్పు, కారం, మసాలా పొడి వేసి కలుపుకోవాలి. ఇందులోనే ఉడికించిన గోంగూర ముద్దను కూడా వేసి కలుపుకోవాలి. పచ్చడి చల్లారాకా అందులో నిమ్మరసం కలుపుకోండి చాలు.
-అంతే గోంగూర చికెన్ పచ్చడి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
