Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Usirikaya pachadi: ఉసిరికాయ రోటి పచ్చడి..మర్చిపోలేరు దీని రుచి..చలికాలంలో తినాల్సిందే
డాక్టర్లు జబ్బులు తగ్గడానికి మెడిసిన్ ఇస్తారు..అయితే ప్రకృతి ఆ జబ్బులు రాకుండా మెడిసిన్ ఇస్తుంది. వాటిలో ఒకటే ఉసిరికాయ. అలాంటి దివ్యౌషధమైన ఉసిరికాయతో ఉసిరికాయ తొక్కు లేదా పచ్చడి(usirikaya pachadi) చేస్తే పిల్లలైనా,పెద్దలైనా లొట్టలేసుకుంటూ తింటారు. ఈ చలికాలంలో వేడి వేడి అన్నంలో ఉసిరి రోటి పచ్చడి వేసుకుని తింటే జిందగీలో ఇలాంటి టేస్ట్ రుచిలేదని మీరే అంటారు. మరి ఆలస్యం దేనికి ఈ ఉసిరి రోటి పచ్చడి ఎలా తయారు చేయాలి,దీని తయారీకి ఏమేం కావాలో ఇక్కడ చూడండి.
ఉసిరి రోటి పచ్చడి తయారీకి కావాల్సినవి
-ఉసిరికాయలు
-మెంతులు
-ఆవాలు
-మిననప్పు
-ఎండుమిర్చి
-పసుపు
-జీలకర్ర
-వెల్లుల్లి
-కరివేపాకు
-ఉప్పు
-నూనె

ఉసిరికాయ రోటి పచ్చడి తయారీ విధానం
-ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడిగా తేమ లేకుండా తుడిచి ముక్కలుగా
కట్ చేసుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్
మెంతులు,ఆవాలు వేసి దొరగా వేయించుకోవాలి.
-దోరగా వేగిన తర్వాత వాటిని ఓ ప్లేట్ లోకి తీసుకొని పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ పోసి అది వేడయ్యాక అందులో ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి.
-ఎండుమిర్చి కొంచెం వేగాక అందులో 2 టేబుల్ స్పూన్ల మినపప్పు,కరివేపాకు కూడా వేసి దోరగా వేగిన తర్వాత ఇదంతా ఓ ప్లేట్ లోకి తీసుకొని పక్కనపెట్టుకోవాలి.
-ఇప్పుడు అదే కడాయిలో శుభ్రంగా కడిగి తేమ లేకుండా తుడిచిన కట్ చేసిన ఉసిరి ముక్కలను వేయాలి.ఆ ముక్కల మీద కొంచెం పసుపు వేయాలి.
-ఓ ఐదు నిమిషాలు తక్కువ మంటమీద ఉసిరి ముక్కలను మగ్గించుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న మెంతులు,ఆవాలను రోట్లో వేసి దంచుకోవాలి.
-తర్వాత మరో ప్లేట్ లో వేయించి పెట్టి ఉంచిన ఎండుమిర్చి మిశ్రమాన్ని కూడా రోట్లో వేసి దంచాలి.
-ఇప్పుడు వెల్లుల్లి జీలకర్ర,రుచికి సరిపడా ఉప్పు కూడా అందులో వేసి బాగా దంచి అందులో మగ్గించి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలను కూడా అందులో వేసి దంచాలి.
-బాగా దంచిన తర్వాత ఆ మిశ్రమాన్ని ఓ బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి పోపుతో తాళింపు వేసుకొని ఆ బౌల్ లోని మిశ్రమాన్ని తాళింపులో కలిపితే ఎంతో రుచికరమైన ఉసిరికాయ రోటి పచ్చడి రెడీ.
-అయితే రోలు రోకలి లేనివాళ్లు మిక్సీ ఉపయోగించి కూడా ఈ పచ్చడి చేసుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications