Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
కూరగాయల రారాజు, ఆకుకూరల రాణి కలిస్తే..వంకాయ తోటకూర పచ్చడి..ఒక్కసారి తింటే ఫ్యాన్ అయిపోతారు!
మనం రోజూ తినే ఆహారంలో రుచితో పాటు ఆరోగ్యాన్ని మేళవించడం మన సంప్రదాయం. అటువంటి ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకాల్లో వంకాయ తోటకూర పచ్చడి ఒకటి. కూరగాయలలో రారాజు అయిన వంకాయ, ఆకుకూరలలో రాణి అయిన తోటకూర కలిస్తే వచ్చే రుచి అమోఘం.
కేవలం రుచికే కాకుండా, శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజ లవణాలను అందించడంలో ఈ పచ్చడి కీలక పాత్ర పోషిస్తుంది. సూపర్ టేస్టీ వంకాయ తోటకూర పచ్చడి ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
-వంకాయలు
-తోటకూర
-పచ్చిమిర్చి
-టమాటో
-చింతపండు
-వెల్లుల్లి రెబ్బలు
-జీలకర్ర
-ధనియాలు
-నూనె
-ఉప్పు
-పసుపు
-కొత్తిమీర
-ఆవాలు
-జీలకర్ర
-ఎండుమిర్చి
-కరివేపాకు
-నువ్వులు
-ఇంగువ
తయారీ విధానం
-1 మీడియం సైజు తోటకూర కట్ట తీసుకొని ఆకులను నీటిలో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి.
-తర్వాత 4 మీడియం సైజు వంకాయలను మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి ఉప్పు కలిపిన నీళ్లల్లో ఈ ముక్కలు వేసి పక్కన ఉంచండి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో 1 టీస్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక ఇందులో పావు టీస్పూన్ మెంతులు, 2 టీస్పూన్ల ధనియాలు, అర టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర వేసి వీటన్నింటిని దోరగా వేయించాలి.
-ఇప్పుడు అందులో 1-2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేసి వేయించుకోండి. అన్నీ దోరగా వేగిన తర్వాత వీటిని బాండీలో నుంచి తీసి పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద ఉన్న బాండీలోనే మరొక టేబుట్ స్పూన్ ఆయిల్ వేసి 15 పచ్చిమిరపకాయలు(ఒక్కో మిరపకాయను రెండుగా తుంపి) వేసి వేయించుకోవాలి.
-పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులోనే తోటకూర ఆకులు వేసి బాగా కలిసేటట్లు కలుపుకున్నాక ఇందులో వంకాయ ముక్కలు వేసి, 3 మీడియం సైజు టమాటోల పెద్ద ముక్కలు , కొద్దిగా చింతపండు, ఒక టీస్పూన్ ఉప్పు, అర టీస్పూన్ పసుపు వేసి బాగా కలుపుకున్నాక మూతపెట్టి తక్కువ మంట మీద మగ్గించాలి.
-ముక్కలు బాగా మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి.
-ఇప్పుడు మిక్సీ గిన్నెలో ముందుగా వేయించుకున్న ధనియాలు నువ్వుల మిశ్రమం వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకొని ఇదే పొడి ఉన్న మిక్సీ గిన్నెలోనే వేయించిన తోటకూర వంకాయ మిశ్రమాన్ని కూడా వేసి, రుచికి తగినంత ఉప్పు వేసి మరీ మెత్తని పేస్ట్ లా కాకుండా, లైట్ బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి.
-పచ్చడిలో తాలింపు కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక ఇందులో అర టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ మినపప్పు, అర టీస్పూన్ పచ్చి శనగపప్పు, కాస్త ఇంగువ, 3 ఎండుమిరపకాయల ముక్కలు, 6 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచి వేసి వేయించుకోవాలి.
-చివరగా తాలింపులో కరివేపాకు కొంచెం వేసుకోండి.
-తాలింపు వేగిన తర్వాత స్టవ్ ఆపేసి తాలింపులో గ్రైండ్ చేసిన పచ్చడిని వేసి కలుపుకోవాలి. అంతే కమ్మని వంకాయ తోటకూర పచ్చడి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications