Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
సండే స్పెషల్: పప్పుచారులోకి అదిరిపోయే సైడ్ డిష్ గ్రీన్ మసాలా కింగ్ ఫిష్ ఫ్రై..ఇంట్లోనే ఇలా ఈజీగా
సాధారణంగా మనం ఇంట్లో చేపల ఫ్రై అనగానే కారం, మసాలాలు దట్టించి ఎర్రగా వేయించడం చూస్తుంటాం. కానీ, దానికి భిన్నంగా కాస్త కొత్త రుచితో, ఆరోగ్యకరమైన ఆకుకూరల ఫ్లేవర్ తో అద్భుతంగా ఉండే రెసిపీనే గ్రీన్ మసాలా కింగ్ ఫిష్ ఫ్రై. కింగ్ ఫిష్ అంటే వంజరం చేప. దీనికి ముళ్లు తక్కువగా ఉండి, కండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేపుడు చేసుకోవడానికి ఇది పర్ఫెక్ట్. రెస్టారెంట్ స్టైల్ రుచిని తలపించే ఈ వంటకాన్ని మీ ఇంట్లోనే ఎలా సులభంగా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

గ్రీన్ మసాలా కింగ్ ఫిష్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు
కొత్తిమీర- 1 కప్పు
పుదీనా- 1 కప్పు
చిన్న ఉల్లిపాయలు - 7 నుండి 8
వెల్లుల్లి రెబ్బలు - 10
అల్లం - 2 అంగుళాల ముక్క
పచ్చిమిర్చి - 5 నుండి 6
మిరియాలు- అర టేబుల్ స్పూన్
జీలకర్ర- అర టీస్పూన్
కింగ్ ఫిష్ (వంజరం చేప) ముక్కలు
రుచికి సరిపడా ఉప్పు
పసుపు- అర టీస్పూన్
మిరియాల పొడి - అర టీస్పూన్
గరం మసాలా - అర టీస్పూన్
కార్న్ ఫ్లోర్ (మొక్కజొన్న పిండి) - 2 టేబుల్ స్పూన్లు
నిమ్మకాయ - సగం
చిల్లీ ఫ్లేక్స్ - కొద్దిగా
కరివేపాకు - కొద్దిగా
గ్రీన్ మసాలా కింగ్ ఫిష్ ఫ్రై తయారీ విధానం
-ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో శుభ్రంగా కడిగిన కొత్తిమీర, పుదీనా ఆకులు వేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే చిన్న ఉల్లిపాయలు, పొట్టు తీసిన వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, మిరియాలు, జీలకర్ర వేసి మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చటి మసాలానే ఫిష్ ఫ్రైకి అసలైన రుచిని, అద్భుతమైన ఫ్లేవర్ ను ఇస్తుంది.
-ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న కింగ్ ఫిష్ ముక్కలను ఒక వెడల్పాటి గిన్నెలో తీసుకోవాలి. అందులో రుచికి సరిపడా ఉప్పు, పసుపు, మిరియాల పొడి, గరం మసాలా వేయాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న గ్రీన్ మసాలా పేస్ట్ ను చేప ముక్కలకు బాగా పట్టించాలి. ఇప్పుడు అందులో ముక్కలు క్రిస్పీగా రావడం కోసం కార్న్ ఫ్లోర్, పులుపు కోసం సగం నిమ్మచెక్క రసం, అదనపు ఘాటు కోసం చిల్లీ ఫ్లేక్స్, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. మసాలా అంతా చేప ముక్కలకు లోపలి వరకు పట్టేలా బాగా మర్దనా చేసి, కనీసం అరగంట పాటు ఫ్రిజ్ లో ఉంచాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి, ఒక నాన్ స్టిక్ పాన్ లేదా ఇనుప పెనం పెట్టుకొని షాలో ఫ్రైకి సరిపడా నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా పెనం మీద వేయాలి. మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి, రెండు వైపులా మంచిగా వేగి క్రిస్పీగా మారే వరకు వేయించుకోవాలి.
-అంతే,ఎంతో సువాసనతో నోరూరించే వేడి వేడి గ్రీన్ మసాలా కింగ్ ఫిష్ ఫ్రై రెడీ.
-దీనిని ఒక ప్లేట్ లోకి తీసుకొని, ఉల్లిపాయ చక్రాలు, నిమ్మకాయతో గార్నిష్ చేసి వడ్డించండి. పప్పుచారు లేదా రసం అన్నంలోకి సైడ్ డిష్ గా ఇది అద్భుతంగా ఉంటుంది. పార్టీలలో స్టార్టర్ గా కూడా బాగుంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications