Latest Updates
-
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్!
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్!
సాయంత్రం కాగానే ఏదైనా వేడివేడిగా, కాస్త కారంగా తినాలనిపించడం సహజం. రోజూ తినే బజ్జీలు, పకోడీలు, ఉప్మాలకు బదులుగా ఏదైనా కొత్తగా,ఆరోగ్యకరంగా ప్రయత్నించాలనుకుంటున్నారా? అయితే గుజరాత్ సంప్రదాయ వంటకం, అక్కడి ప్రజలు ఎంతో ఇష్టంగా తినే జొన్న ఖీచూ బెస్ట్ ఆప్షన్. జొన్నలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గ్లూటెన్ లేని జొన్నల్లో ఫైబర్, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిస్ ఉన్నవారికి వరం లాంటివి.

జొన్న ఖీచూ తయారీకి కావాల్సిన పదార్థాలు
జొన్న పిండి - 1 కప్పు
పెరుగు- 1 కప్పు
నీళ్లు - ఒకటిన్నర కప్పులు
పసుపు - పావు టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
నెయ్యి - 1 టేబుల్ స్పూన్
వంటనూనె - 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - 1 టీస్పూన్
తెల్ల నువ్వులు - 1 టేబుల్ స్పూన్
ఇంగువ - పావు టీస్పూన్
సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు - ఒక టేబుల్ స్పూన్
కరివేపాకు - రెండు రెమ్మలు
తాజా కొత్తిమీర - కొద్దిగా
పచ్చి వేరుశనగ నూనె, ఆవకాయ మసాలా లేదా కారం పొడి-కొద్దిగా
జొన్న ఖీచూ తయారీ విధానం
-ముందుగా ఒక వెడల్పాటి గిన్నెను తీసుకోండి. అందులో ఒక కప్పు జొన్న పిండి, ఒక కప్పు పెరుగు, మరియు ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి బాగా కలపాలి. పిండిలో ఎలాంటి ఉండలు లేకుండా, మజ్జిగలా మృదువుగా ఉండేలా విస్కర్ సహాయంతో కలుపుకోండి.
-ఇప్పుడు ఆ పిండి మిశ్రమంలో కొద్దిగా పసుపు, మీ రుచికి తగినట్లుగా ఉప్పు, కారంగా ఉండేలా అల్లం-పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి. దీనికి తోడు వంటకానికి కమ్మని సువాసన ఇచ్చే నెయ్యిని కూడా వేసి మరోసారి బాగా కలిపి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మందపాటి కడాయి పెట్టుకోండి. అందులో నూనె వేడి చేసి, ముందుగా జీలకర్ర, తెల్ల నువ్వులు వేసి వేయించండి. నువ్వులు చిటపటలాడుతున్నప్పుడు ఇంగువ, సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు, తాజా కొత్తిమీర వేసి వేయించుకోవాలి. తాలింపు వేగుతుంటే ఇల్లంతా గుమగుమలాడిపోతుంది.
-తాలింపు బాగా వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న జొన్న పిండి మిశ్రమాన్ని నెమ్మదిగా కడాయిలో పోయండి. ఇప్పుడు మంటను మీడియంలో ఉంచి, గరిటెతో నిరంతరంగా కలుపుతూనే ఉండాలి. పిండి అడుగంటకుండా జాగ్రత్తపడాలి.
-నెమ్మదిగా ఈ మిశ్రమం దగ్గరపడి, ఉప్మా లాంటి ఆకృతికి వస్తుంది. పిండి పచ్చివాసన పోయి, కడాయికి అతుక్కోకుండా విడిపోతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. అంతే జొన్న ఖీచూ రెడీ.
-వేడివేడిగా ఉన్న ఈ జొన్న ఖీచూను ఒక ప్లేట్ లోకి తీసుకొని, పైన కొద్దిగా పచ్చి వేరుశనగ నూనె చల్లుకోండి. దానికి తోడుగా కాస్త ఆవకాయ మసాలా కానీ, లేదా ఎర్ర కారం కానీ చల్లుకొని తింటే ఆ రుచికి మీరు ఫిదా అవ్వాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications