Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
బిర్యానీని మించిన రుచితో గుత్తి వంకాయ పులావ్.. ఇలా చేస్తే లొట్టలేసుకుని తింటారు!
వంకాయ వంటి కూర.. పంకజముఖి సీత వంటి భామ లేదు అనే నానుడి ఊరికే పుట్టలేదు. తెలుగు వారి భోజనంలో వంకాయకు ఉండే స్థానం అలాంటిది. సాధారణంగా మనం గుత్తి వంకాయ కూర చేసుకుంటాం. ఆ మసాలా ఘాటుకు, వంకాయ రుచికి వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే ఆ మజాయే వేరు.
అయితే ఎప్పుడైనా గుత్తి వంకాయ పులావ్ ట్రై చేశారా? బిర్యానీలు, నాన్ వెజ్ వంటకాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండే దీనిని ఒక్కసారి తిన్నారంటే.. మళ్లీ మళ్లీ కావాలంటారు

గుత్తి వంకాయ పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-బాస్మతి బియ్యం
-లేత గుత్తి వంకాయలు
-లవంగాలు
-యాలకులు
-దాల్చిన చెక్క
-ఎండు మిరపకాయలు
-పచ్చి మిర్చి పేస్ట్
-కొత్తిమీర
-పుదీనా
-అల్లం
-వెల్లుల్లి
-ఫ్రైడ్ ఆనియన్స్
-ఉల్లిపాయలు
-టమాటా ముక్కలు
-నూనె
-ఉప్పు
గుత్తి వంకాయ పులావ్ తయారీ విధానం
-ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి, అరగంట పాటు నానబెట్టుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను నూనెలో దోరగా వేయించి (ఫ్రైడ్ ఆనియన్స్) పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని కూడా మిక్సీ పట్టి ఘాటైన పేస్ట్ రెడీ చేసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఎండు మిరపకాయలు వేసి సువాసన వచ్చేలా వేయించాలి. అందులోనే కొత్తిమీర, పుదీనా, అల్లం, వెల్లుల్లి, ముందుగా రెడీ చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, తగినంత ఉప్పు వేసి దోరగా వేయించుకోవాలి. ఈ మిశ్రమం చల్లారాక మిక్సీ పట్టి మెత్తటి మసాలా ముద్దలా తయారుచేసుకుని పక్కన ఉంచుకోవాలి.
-ఇప్పుడు లేత గుత్తి వంకాయలను తీసుకుని బాగా కడగాలి. వీటిని కట్ చేసే పద్ధతి చాలా ముఖ్యం. వంకాయ అడుగు భాగం నుంచి ఒక గాటు, అలాగే తొడిమ పైనుంచి (రివర్స్ లో) మరో గాటు పెట్టుకోవాలి.
-స్టవ్ మీద బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోయాలి. కట్ చేసిన వంకాయలను అందులో వేసి, రంగు మారి మెత్తబడే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత వంకాయలను ప్లేట్ లోకి తీసి చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా ముద్దను వంకాయల లోపల జాగ్రత్తగా స్టఫింగ్ చేయాలి.
-ఒక వెడల్పాటి గిన్నెను స్టవ్ మీద పెట్టి సరిపడా నూనె వేయాలి. నూనె వేడెక్కాక నిలువుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి మగ్గనివ్వాలి. తర్వాత మీ కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా వేయించాలి. వంకాయల్లో స్టఫ్ చేయగా మిగిలిన మసాలా ముద్దను కూడా ఇందులో వేసి బాగా కలపాలి. తగినంత ఉప్పు వేసి, నానబెట్టిన బియ్యానికి సరిపడా నీళ్లు పోసి మరగనివ్వాలి.
-నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి ఉడకనివ్వాలి. అన్నం మూడొంతులు ఉడికిన తర్వాత (నీరు ఇంకా కొద్దిగా ఉన్నప్పుడు), మసాలా కూర్చిన వంకాయలను ఒక్కొక్కటిగా అన్నంలో నిలువుగా గుచ్చాలి. మూత పెట్టి, మంటను సిమ్ లో ఉంచి దమ్ అయ్యేలా రైస్ కుక్ అయ్యే వరకు ఉడికించాలి.
-అంతే మూత తీయగానే ఇల్లంతా సువాసనలు వెదజల్లే గుత్తి వంకాయ పులావ్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications