Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
అన్నం మిగిలిందా? కర్ణాటక స్పెషల్ టమాటో చిత్రాన్నం చేయండి..రుచి చూస్తే ఫిదా!
ప్రతి ఇంట్లోనూ మధ్యాహ్నం లేదా రాత్రి పూట అన్నం మిగిలిపోవడం చాలా సహజం. ఆ అన్నాన్ని ఏం చేయాలా అని ఆలోచిస్తుంటాం. పెరుగన్నం లేదా పులిహోర చేసి విసుగు పుట్టిందా? అయితే ఓసారి కర్ణాటక రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధి చెందిన, నోరూరించే టమాటో చిత్రాన్నం ట్రై చేయాల్సిందే.
ఇది కేవలం మిగిలిపోయిన అన్నాన్ని సద్వినియోగం చేసుకోవడమే కాదు, ఒక అద్భుతమైన బ్రేక్ ఫాస్ట్ గా లేదా లంచ్ బాక్స్ రెసిపీగా కూడా ఉపయోగపడుతుంది. సాధారణ టమాటో రైస్‌కి, కర్ణాటక స్టైల్ టమాటో చిత్రాన్నానికి చిన్న తేడా ఉంది. కర్ణాటక శైలిలో మనం వాడే మసాలా దినుసులు, ముఖ్యంగా సాంబార్ పౌడర్ లేదా వాంగీ బాత్ పౌడర్ వాడటం వల్ల దీనికి ప్రత్యేకమైన రుచి వస్తుంది.

కావాల్సిన పదార్థాలు
-ఉడికించిన అన్నం
-టమాటోలు
-ఉల్లిపాయ
-పచ్చిమిర్చి
-నూనె
-ఆవాలు
-జీలకర్ర
-శెనగపప్పు
-మినపప్పు
-వేరుశెనగ గుళ్ళు (పల్లీలు)
-కరివేపాకు
-ఎండుమిర్చి
-ఇంగువ
-పసుపు
-కారం
-సాంబార్ పౌడర్
-ఉప్పు
-కొత్తిమీర
-పచ్చి కొబ్బరి తురుము
తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద బాండీ లేదా పాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చెయ్యాలి.
-వేడెక్కిన నూనెలో 3 టేబుల్ స్పూన్ల పల్లీలు(వేరుశెనగపప్పు)వేసి ఎర్రగా వేపుకోవాలి. పల్లీలు సగం పైనే వేగిన తర్వాత ఇందులో 1 టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ పచ్చి శెనగపప్పు, 2 ఎండుమిర్చి ముక్కలు, 1 టీస్పూన్ మినపప్పు వేసి తాలింపుని ఎర్రగా వేపాలి.
-వేగిన తాలింపులో రెండు చిటికెళ్ల ఇంగువ వేసి ఒకసారి పొంగనిచ్చాక ఇందులో 1 పెద్ద ఉల్లిపాయ సన్నని తరుగు, 2 పచ్చి మిరపకాయల సన్నని తరుగు, 2 రెమ్మల కరివేపాకు వేసి వేపాలి.
-ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత అందులో 3 పండిన టమాటోల సన్నని తరుగు, కొత్తిమీర తరుగు కొంచెం వేసి మూతపెట్టి టమాటో ముక్కలు గుజ్జుగా అయ్యేదాకా మీడియం మంట మీద మగ్గించాలి.
-తర్వాత అందులో అర టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అర టేబుల్ స్పూన్ కారం వేసి ఒక నిమిషం వేపుకోవాలి.
-ఇప్పుడు అందులో 1కప్పు(180గ్రా)ఉడికించిన అన్నం, 1 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి, కొంచెం కొత్తిమీర తరుగు, పావు కప్పు పచ్చికొబ్బరి తురుము వేసి పెద్ద మంట మీద కలుపుతూ ఉండాలి. మొత్తం బాగా కలిశాక స్టవ్ ఆపేయండి.
-అంతే టమాటో చిత్రాన్నం రెడీ. పుల్లపుల్లగా, కారంగా, కొంచెం తీపిగా ఉండే ఈ చిత్రాన్నం రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారు.
-మిగిలిపోయిన అన్నం అయితే పొడిపొడిగా ఉండి, మసాలాను బాగా పీల్చుకుంటుంది. అందుకే తాజా అన్నం కంటే రాత్రి మిగిలిన అన్నంతో ఇది చాలా బాగా కుదురుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications