Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
రోజూ తినే టిఫిన్లతో విసుగు వచ్చిందా? అయితే ఈ స్పెషల్ ఆలు రోటీ ట్రై చేయండి..టేస్ట్ కేక!
పొద్దున్నే టిఫిన్ లోకి రోజూ ఇడ్లీ, దోశ, పూరీ వంటివి తిని తిని మీకు, మీ కుటుంబ సభ్యులకు విసుగు వచ్చిందా? కొత్తగా ఏదైనా చేద్దామంటే సమయం సరిపోవడం లేదా? అయితే మీకోసం ఒక అద్భుతమైన వంటకం ఉంది. అదే ఆలు రోటీ. నార్త్ ఇండియా ఫేమస్ అయిన ఆలు పరాఠాకు ఇది ఒక సులభమైన, రుచికరమైన వెర్షన్.
సాధారణంగా ఆలు పరాఠాలు కాస్త మందంగా ఉంటాయి. కానీ ఆలు రోటీ ప్రత్యేకత ఏమిటంటే..ఇది చాలా సన్నగా, మృదువుగా ఉంటుంది. నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేంత మెత్తగా ఉండటం దీని హైలైట్. ఆరోగ్యపరంగా కూడా ఇది చాలా మేలు చేస్తుంది. లంచ్ బాక్సులకు ఇది బెస్ట్ ఛాయిస్. ఆలు రోటీ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
-ఉడికించిన బంగాళాదుంపలు
-గోధుమ పిండి
-జీలకర్ర
-ధనియాల పొడి
-ఎర్ర కారం పొడి
-గరం మసాలా
-ఆమ్చూర్ పొడి
-ఉప్పు
-నూనె
-కొత్తిమీర
తయారీ విధానం
-ముందుగా బంగాళాదుంపలను ఉడికించి తొక్క తీసి పెట్టుకోవాలి. వీటిని ఉండలు లేకుండా మెత్తగా స్మాష్ చేయాలి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడయ్యాక జీలకర్ర వేయాలి. అందులో స్మాష్ చేసిన బంగాళాదుంపలు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఆమ్చూర్ పొడి, కొత్తిమీర వేసి బాగా కలపాలి. మసాలా వాసన వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు ఒక గిన్నెలో గోధుమ పిండి, చిటికెడు ఉప్పు వేసి, తగినంత నీరు పోసి చపాతీ పిండిలా మృదువుగా కలుపుకోవాలి. పిండి ఆరిపోకుండా తడి గుడ్డ కప్పి ఒక 15 నిమిషాలు నాననివ్వాలి. ఇలా చేయడం వల్ల రోటీలు చాలా సాఫ్ట్ గా వస్తాయి.
-నానిన పిండిలోంచి చిన్న బంతిని తీసుకుని, దానిని చిన్న గిన్నెలా (కప్ షేప్) చేసుకోవాలి. అందులో ముందుగా సిద్ధం చేసుకున్న బంగాళాదుంప మిశ్రమాన్ని కొద్దిగా పెట్టాలి. పిండి అంచలన్నింటినీ మూసివేసి, పొడి పిండి చల్లుతూ మెల్లగా, సన్నగా చపాతీలా ఒత్తుకోవాలి.
-స్టవ్ మీద పెనం పెట్టి వేడయ్యాక, ఒత్తుకున్న రోటీని వేయాలి. రెండు వైపులా నెయ్యి లేదా నూనె రాస్తూ బంగారు రంగు మచ్చలు వచ్చే వరకు మీడియం మంట మీద కాల్చుకోవాలి. నెయ్యి వాడితే రుచి అద్భుతంగా ఉంటుంది.
-వేడి వేడి ఆలు రోటీని చల్లటి పెరుగు, నిమ్మకాయ ఊరగాయ లేదా టమాటో సాస్ తో సర్వ్ చేస్తే రుచి అమోఘంగా ఉంటుంది. అసలు ఏ సైడ్ డిష్ లేకపోయినా ఇందులో ఉండే మసాలా ఘాటు వల్ల ఉత్తి రోటీనే తినేయొచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications