Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
ఘాటుగా,కారంగా..మిగిలిపోయిన అన్నంతో ఘుమఘుమలాడే తమలపాకు రైస్..ఎలా చేసుకోవాలంటే
మిగిలిపోయిన అన్నంతో ఎగ్ ఫ్రైడ్ రైస్, పులిహోర,టమాటో రైస్ వంటివి చేసుకునే బదులు ఓ సారి తమలపాకు రైస్ రెసిపిని ట్రై చేయండి. ఘాటుగా కారంగా ఘమఘుమలాడుతూ చాలా రుచిగా ఉంటుంది తమలపాకు రైస్. మిగిలిపోయిన అన్నం అనే కాదు అప్పటికప్పుడు వండిన అన్నంతో కూడా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. లంచ్ బాక్సులకి కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఆరోగ్యానికి బోలెడంత మేలు చేసే తమలపాకులతో చేసే ఈ రైస్ ని మీ ఇంట్లోనే సులభంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక్కడ చూడండి.
తమలపాకు అన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు
-పల్లీలు
-ఎండుమిర్చి
-తమలపాకులు
-ఉల్లిపాయలు
-ఆయిల్
-ఉప్పు
-పసుపు
-జీలకర్ర
-ఆవాలు
-నువ్వులు
-మినపప్పు
-వెల్లుల్లి

తమలపాకు రైస్ తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో 10 వెల్లుల్లి రెబ్బలు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసి మినపప్పు మంచి సువాసన వచ్చి రంగు మారే సమయంలో ఇందులో 5 ఎండుమిరపకాయలు వేసి వేపండి.
-ఇప్పుడు అందులో రెండున్నర టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి చిట్లనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయండి.
-తర్వాత ఈ మిశ్రమం మొత్తాన్ని మిక్సీ గిన్నెలో వేసి మెత్తని పొడిగా గ్రైండ్ చేసుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద అదే గిన్నె పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి వేడి చేసి అందులో పావు కప్పు పల్లీలు వేసి ఎర్రగా వేగనిచ్చాక ముప్పావు టీస్పూన్ జీలకర్ర, ముప్పావు టీస్పూన్ ఆవాలు, 1 కప్పు ఉల్లిపాయ తరుగు, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసి వేపుకోండి.
-ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత అందులో 5 తమలపాకుల సన్నని తరుగు వేసి మూడు నిమిషాలు వేపుకోండి. ఎక్కువగా వేపితే తమలపాకుల్లోని ఘాటు,సువాసన పోతాయని గుర్తుంచుకోండి.
-తర్వాత అందులో వండిన అన్నం లేదీ మిగిలిపోయిన అన్నం,గ్రైండ్ చేసుకున్న పొడి వేసి పెద్ద మంట మీద 2-3 నిమిషాలు కలబెడుతూ ఉండండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే తమలపాకు అన్నం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications