Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
వర్షంలో వేడి వేడిగా..పోషకాల పవర్ ప్యాక్ సూప్..కేవలం 15 నిమిషాల్లో ఎలా చేసుకోవాలంటే
చిరుజల్లులు కురిసే చల్లని సాయంత్రమైనా, నీరసంగా అనిపించే వేడి మధ్యాహ్నమైనా మనసు ఏదైనా వెచ్చని, రిఫ్రెషింగ్ పానీయం కోసం ఆరాటపడుతుంది. అలాంటి సమయంలో వేడివేడి సూప్ కంటే మంచి ఛాయిస్ ఏముంటుంది? ముఖ్యంగా, షుగర్ పేషెంట్లు కూడా ఎలాంటి సందేహం లేకుండా తాగగలిగే సూప్ అయితే ఇంకా మంచిది కదా.. అలాంటి అద్భుతమైన రుచి, ఆరోగ్యం కలగలిసినదే ఈ నిమ్మకాయ కొత్తిమీర వెజిటబుల్ సూప్.
కేవలం 15 నిమిషాల్లో నిమ్మకాయ కొత్తిమీర వెజిటబుల్ సూప్ రెడీ చేసుకోవచ్చు. కంటికి ఇంపుగా కనిపించే రంగురంగుల కూరగాయలు, తాజా కొత్తిమీర సువాసన, నిమ్మకాయలోని పుల్లని రుచి..అన్నీ కలిసి మీ నాలుకకు కొత్త అనుభూతినిస్తాయి. ఇది శరీరానికి అవసరమైన పోషకాలను అందించే సంపూర్ణ ఆహారం కూడా.

కావలసిన పదార్థాలు
-సన్నగా తరిగిన కొత్తిమీర
-నిమ్మరసం
-అల్లం-వెల్లుల్లి తురుము
-పచ్చిమిర్చి
-క్యారెట్లు
-పుట్టగొడుగులు
-మొక్కజొన్న పిండి
-నూనె
-రుచికి సరిపడా ఉప్పు
-నల్ల మిరియాల పొడి
తయారీ విధానం
-నిమ్మ-కొత్తిమీర సూప్ తయారీకోసం ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి అందులో కొద్దిగా నూనె వేడి చేసి, అల్లం-వెల్లుల్లి తురుము వేసి మంచి వాసన వచ్చేవరకు వేయించాలి.
-తర్వాత అందులో తరిగిన క్యారెట్లు, పుట్టగొడుగులు వేసి మూడు నిమిషాల పాటు వేయించాలి.
-ఆ తర్వాత నాలుగు కప్పుల నీళ్లు, ఉప్పు, కారం వేసి బాగా మరిగించాలి.
-ఒక చిన్న గిన్నెలో కొద్దిగా నీటితో మొక్కజొన్న పిండిని ఉండలు లేకుండా కలిపి, మరుగుతున్న సూప్ లో పోయాలి.
-సూప్ చిక్కబడే వరకు సుమారు 2-3 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించి, స్టవ్ ఆఫ్ చేయాలి.
-చివరగా నిమ్మరసం, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలపాలి.
-వేడివేడి సూప్ ను గిన్నెలో పోసి పైన కొద్దిగా మిరియాల పొడి, మరికొంత కొత్తిమీరతో అలంకరించుకుని ఆస్వాదించండి.
ఈ సూప్ ప్రయోజనాలు
విటమిన్-సికి పర్యాయపదం లాంటి నిమ్మరసం శరీర రోగనిరోధక శక్తిని అమాంతం పెంచుతుంది. చర్మాన్ని కాంతివంతంగా మార్చి, శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది.
కొత్తిమీరలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణశక్తిని మెరుగుపరిచి, శరీరంలోని మలినాలను బయటకు పంపడంలో సహాయపడతాయి.
అల్లం, వెల్లుల్లి ఈ రెండింటిలోనూ సహజ సిద్ధమైన యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి.
క్యారెట్లు, పుట్టగొడుగుల వంటివి విటమిన్లు, ఫైబర్, ప్రోటీన్ లతో నిండి ఉండి ఈ సూప్ ను మరింత పోషకభరితంగా మారుస్తాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications