Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
పప్పులు,రవ్వ,బియ్యం అక్కర్లేదు..ఓట్స్ తో 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ దోసలు..ఎలా చేసుకోవాలంటే..
ఉదయం పూట తీసుకునే ఫుడ్ మన శరీరానికి రోజంతా అవసరమయ్యే శక్తిని అందిస్తుందని మనందరికీ తెలుసు. అయితే సమయాభావం కారణంగా చాలామంది బ్రేక్ ఫాస్ ట్‌ను దాటవేయడమో లేదా అనారోగ్యకరమైన ఫాస్ట్ ఫుడ్ పై ఆధారపడడమో చేస్తున్నారు. ఈ సమస్యకు ఒక అద్భుతమైన పరిష్కారమే ఇన్స్టంట్ ఓట్స్ దోస. దీనికి గంటల తరబడి పప్పులు నానబెట్టాల్సిన అవసరం లేదు, పిండిని పులియబెట్టాల్సిన శ్రమ అస్సలు లేదు. రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేసే ఓట్స్ దోసను అప్పటికప్పుడు జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ చేసుకోవచ్చు.
పొద్దున హడావిడిగా ఆఫీసులకు, స్కూల్స్ కి వెళ్లేవారికి, ఆరోగ్యకరమైన ఆహారం తినాలనుకునే వారికి, కొత్త రుచులు ప్రయత్నించాలనుకునే వారికి ఓట్స్ దోస పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఓట్స్ మన ఆరోగ్యానికి చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. సాంప్రదాయ దోసకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా నిలిచే ఓట్స్ దోస ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-ఓట్స్
-ఉల్లిపాయ
-పచ్చిమిరపకాయ
-అల్లం
చట్నీ కోసం:
-వేరుశెనగపప్పు
-తినే శెనగపప్పు
-పచ్చిమిరపకాయలు
-వెల్లుల్లి
-అల్లం
-ఆయిల్
-ఉప్పు
-తాలింపు గింజలు
తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో పెద్ద కప్పు నిండా లేదా ప్లేట్ నిండుగా తీసుకున్న ఓట్స్ వేయాలి. ఓట్స్ మునిగేవరకు నీళ్లు పోసి కలిపి మూతపెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
-10 నిమిషాల పాటు బాగా నానిన ఓట్స్ ని మిక్సీ గిన్నెలో వేసి,ఇందులోనే 1 ఉల్లిపాయ మీడియం సైజు ముక్కలు, 1 ఇంచు అల్లం ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోని ఓ బౌల్ లోకి పిండిని తీసుకోండి.
-పిండిలో రుచికి తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి దోసలు వేసుకోవడమే. అంతే ఓట్స్ దోసలు రెడీ.
-చట్నీ తయారుకోసం..స్టవ్ మీద కడాయి పెట్టి అందులో అరకప్పుపైనే పల్లీలు వేసి లైట్ గా వేయించాక కారానికి తగినంత పచ్చిమిరపకాయలు కూడా వేసి, చిన్నగా కట్ చేసిన 1 ఇంచు అల్లం ముక్కలు, 5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఆయిల్ వేసి కలుపుతూ వేయించుకోవాలి.
-పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత అందులో పావు కప్పు తినే శెనగపప్పు వేసి లైట్ గా వేయంచుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయండి. చల్లారిన తర్వాత వీటన్నింటిని మిక్సీ గిన్నెలో వేసి,రుచికి సరిపడా ఉప్పు, కొన్ని నీళ్లు కూడా కలుపుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత తాళింపు పెట్టుకుని దానిని ఈ చట్నీలో వేసి కలుపుకోవాలి. చట్నీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications