Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం..యాపిల్ సగ్గుబియ్యం పాయసం ఇలా చేయండి
భారతీయ సాంప్రదాయ వంటకాలలో పాయసం లేదా ఖీర్ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పండుగలు, శుభకార్యాలు లేదా దేవుడికి నైవేద్యం పెట్టాలన్నా మనకు ముందుగా గుర్తుకు వచ్చేది పాయసమే. సాధారణంగా మనం సేమియా, సగ్గుబియ్యం లేదా బియ్యంతో పాయసం చేస్తాం. కానీ పండ్ల రుచితో ముఖ్యంగా యాపిల్, సగ్గుబియ్యం కలయికతో చేసే పాయసం చాలా రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.
ఈ యాపిల్ సగ్గుబియ్యం పాయసం పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఒక అద్భుతమైన డెజర్ట్. ఇది తక్షణ శక్తిని ఇస్తుంది..ఉపవాసం ఉన్నప్పుడు తీసుకోవడానికి ఇది ఒక మంచి ఆహారం. ఈ పాయసం తయారు చేయడం చాలా సులభం. యాపిల్ సగ్గుబియ్యం పాయసం ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-యాపిల్స్
-నెయ్యి
-ఎండుద్రాక్ష
-జీడిపప్పు
-సగ్గుబియ్యం
-పాలు
-కండెన్స్డ్ మిల్క్
-వెనీలా ఎక్స్ ట్రాక్ట్
తయారీ విధానం
-ముందుగా 2 మీడియం సైజు యాపిల్స్ ను చెక్కు తీసుకోండి. ఆ తర్వాత పెద్ద రంధ్రాలు ఉన్నవైపు వాటిని తురుముకోండి. సన్న రంధ్రాలవైపు తురిమితే పేస్ట్ అయ్యి పాయసంలో ఉడికిన తర్వాత యాపిల్ నోటికి అందదు.
-తర్వాత ఒక చిన్న గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల కిస్మిస్(ఎండుద్రాక్ష)వేసి నీళ్లు పోసి నానబెట్టండి.
-తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేశాక ఇందులో యాపిల్ తురుము వేసి సాధ్యమైనంత మేర నీరు ఇగిరిపోయేంతవరకు, అడుగుపట్టకుండా కలుపుతూ వేపుకొని దీనిని గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఉన్న కడాయిలోనే మరికొంచెం నెయ్యి వేసి వేడయ్యాక ఇందులో 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసి ఎర్రగా వేయించి తీసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఉన్న కడాయిలోనే ఒకటింబావు లీటరు పాలు పోసి మరిగించుకోవాలి. మరుగుతున్న పాలలో 1/3 వంతు కడిగిన సగ్గుబియ్యం వేసుకొని కలుపుతూ ఉడికించాలి.
-సగ్గుబియ్యం పాదర్శకంగా అయ్యేపాటికి పాలు 800 ఎమ్ఎల్ వరకు అవుతాయి..ఇంకా చిక్కబడతాయి. ఇప్పుడు మరుగుతున్న పాల మిశ్రమంలోనే 1.3/4 కప్పు కండెన్స్డ్ మిల్క్ వేసుకొని 3-4 నిమిషాలు మరిగించాలి.
-తర్వాత అందులో యాపిల్ తురుము వేసి మరో 3-4 నిమిషాలు మరిగించుకోవాలి.
-పాయసం పల్చగా ఉన్నప్పుడు అందులో వేయించుకున్న జీడిపప్పు, నానబెట్టిన కిస్మిస్, 1 టీస్పూన్ వెనీలా ఎక్స్ ట్రాక్ట్ వేసి కలిపి దించేయాలి. అంతే యాపిల్ సగ్గుబియ్యం పాయసం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












