Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
విరిగిన ఎముకల్ని అతికించి,నడవలేనోళ్లను కూడా పరిగెత్తించే పచ్చడి..ఎలా చేయాలంటే
వజ్రవల్లి అనేది ఒక ఔషధ మొక్క. దీనిని నల్లేరు అని కూడా అంటారు. ఇది ఆయుర్వేదంలో ఎముకలు, కీళ్ల ఆరోగ్యానికి విస్తృతంగా ఉపయోగించబడుతుంది. తీగలాగ పెరిగే ఈ వజ్రవల్లిని ఇంట్లోనే పెంచుకోవచ్చు. ఈ వజ్రవల్లితో చేసే పచ్చడి ఒక్కసారి తింటే వన్స్ మోర్ అనేలా ఉంటుంది. ఎముకలు విరిగినప్పుడు అవి త్వరగా అతుక్కోడానికి, విపరీతంగా వచ్చే దగ్గు, కఫం,శ్వాసకు సంబంధించిన సమస్యలను తగ్గించడానికి ఆయుర్వేదంలో మెడిసిన్ లా వాడే నల్లేరుకాడలతో చేసే పచ్చడి చాలా రుచికరంగా ఉంటుంది. వజ్రవల్లి పచ్చడి తయారుచేసుకోడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
వజ్రవల్లి పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు
వజ్రవల్లి కాడలు - 1 కప్పు
పచ్చిమిర్చి - 10-12
చింతపండు - చిన్న నిమ్మకాయ పరిమాణంలో
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - వేయించడానికి సరిపడా
ఆవాలు - 1 టీస్పూన్
మెంతి గింజలు-10
ధనియాలు-1 స్పూన్
నువ్వులు-2 స్పూన్ లు
జీలకర్ర - అర స్పూన్
మినపప్పు - 1 స్పూన్
శనగపప్పు - 1 స్పూన్
కరివేపాకు - కొన్ని రెబ్బలు
ఎండుమిర్చి-1
వెల్లుల్లి - 4-5 రెబ్బలు
టమాటో-4

వజ్రవల్లి పచ్చడి తయారీ విధానం
-లేతగా ఉండే నల్లేరుకాడలను తీసుకొని పైన ఉండే పీచు తీసి ముక్కలుగా కట్ చేసి నీటిలో వేసి శుభ్రంగా కడి ఓ ప్లేట్ లోకి తీసి పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేడి చేసి అందులో 10 మెంతి గింజలు, 2 స్పూన్ల నువ్వులు, 1 స్పూన్ ధనియాలు, అర స్పూన్ జీలకర్ర వేసి తక్కువ మంటమీద నెమ్మదిగా కలుపుతూ వేయించి ఓ ప్లేట్ లోకి తీసి పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు అదే పాన్ లో ఇంకో స్పూన్ ఆయిల్ వేడి చేసి అందులో 10-12 పచ్చిమిర్చి ముక్కలు, కడిగిపెట్టుకున్న నల్లేరు కాడల ముక్కలను వేసి లోపలివరకు వేగేలా తక్కువమంట మీద నెమ్మదిగా కలుపుతూ వేయించి దీనిని ఓ ప్లేట్ లోకి తీసుకొని పక్కనపెట్టుకోవాలి.
-ఇప్పుడు అదే పాన్ లో ఇంకో స్పూన్ ఆయిల్ వేడి చేసి అందులో 4 సన్నగా కట్ చేసిన టమాటో ముక్కలు,ఉసిరికాయ సైజు అంత చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసి కలుపుతూ ఉడికించాలి. మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి.
-ఇప్పుడు రోట్లో లేదా మిక్సీలో ముందుగా వేయించిన నువ్వుల మొత్తాన్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
-తర్వాత అందులో వేయించిన పచ్చిమిర్చి,నల్లేరుకాడల ముక్కలు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
-తర్వాత అందులో 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఉడికించి టమాటో ముక్కల మిశ్రమాన్ని వేసి వీటిని కూడా మెత్తగా అయ్యేలా గ్రైండ్ చేసుకోవాలి.
-తర్వాత అందులో సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసి కలిపేసి ఈ పచ్చడి మొత్తాన్ని ఓ గిన్నెలోకి తీసిపెట్టుకోవాలి.
-ఇప్పుడు ఈ పచ్చడిని తాళింపు వేయడం కోసం స్టవ్ మీద పాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేడి చేసి అందులో అరస్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చి శెనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 ఎండుమిర్చి వేసి కొంచెం కరివేపాకు వేసి వేయించిన తర్వాత ఈ తాళింపుని పచ్చడిలో వేసి కలపాలి. అంతే వజ్రవల్లి పచ్చడి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications