Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
శీతాకాలం స్పెషల్.. నోరూరించే క్యారెట్ గులాబ్ జామున్.. తయారీ చాలా ఈజీ!
అందుకే ఈ శీతాకాలంలో మీ కుటుంబ సభ్యులకు కొత్త రుచిని పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే క్యారెట్ గులాబ్ జామున్ ట్రై చేయండి. క్యారెట్లతో కేవలం హల్వానే కాదు, జ్యూసీగా ఉండే గులాబ్ జామున్ లను కూడా తయారు చేసుకోవచ్చు. ఇది తయారు చేయడం చాలా సులభం. నోరూరించే క్యారెట్ గులాబ్ జామున్ ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
క్యారెట్లు: 2 కప్పులు
కోవా: 1 కప్పు
మైదా పిండి: 2-3 టేబుల్ స్పూన్లు
చక్కెర: 1 కప్పు
నీళ్లు: 1 కప్పు
యాలకుల పొడి: అర టీస్పూన్
నెయ్యి లేదా నూనె: వేయించడానికి సరిపడా
డ్రై ఫ్రూట్స్: అలంకరణ కోసం

తయారీ విధానం
-ముందుగా క్యారెట్లను ఉడికించాలి. ఉడికించిన క్యారెట్ ను తురుముకొని పక్కన పెట్టుకోండి.
-తర్వాత ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో చక్కెర, నీటిని సమపాళ్లలో (1:1 నిష్పత్తిలో) తీసుకోండి. దీనిని హై ఫ్లేమ్ లో మరిగించాలి. చక్కెర పూర్తిగా కరిగి, పాకం లేత తీగ పాకం వచ్చే వరకు ఉడికించాలి. చివరగా మంచి సువాసన కోసం యాలకుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. పాకం మరీ చల్లారిపోకుండా చూసుకోవాలి.
-ఇప్పుడు ఒక పాన్ లో కొద్దిగా నెయ్యి వేడి చేసి, అందులో ముందుగా ఉడికించి తురుముకున్న క్యారెట్ ను వేయాలి. క్యారెట్ లోని తేమ పోయేలా 2-3 నిమిషాలు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో కోవా (మావా) వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం చిక్కబడి దగ్గరకు వచ్చే వరకు ఉడికించాక స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారనివ్వాలి.
-ఇప్పుడు ఈ మిశ్రమంలో మైదా పిండి, చిటికెడు యాలకుల పొడి వేసి మెత్తని పిండి ముద్దలా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉంటే జామున్‌లు గట్టిపడతాయి, మరీ మెత్తగా ఉంటే విడిపోతాయి. అవసరమైతే మరికొద్దిగా మైదా జోడించవచ్చు.
-తయారు చేసుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఉండలు చేసేటప్పుడు పగుళ్లు లేకుండా నునుపుగా ఉండేలా చూసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి, డీప్ ఫ్రైకి సరిపడా నెయ్యి లేదా నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక మంటను సిమ్ లో పెట్టి జామున్ లను వేయాలి. బంగారు రంగు వచ్చే వరకు నెమ్మదిగా వేయించుకోవాలి. ఎక్కువ మంట పెడితే పైన మాడిపోయి, లోపల పిండి పచ్చిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించాలి.
-వేయించిన జామున్‌లను వెంటనే తీసి, గోరువెచ్చగా ఉన్న చక్కెర పాకంలో వేయాలి. కనీసం 20 నిమిషాల నుండి గంట సేపు వాటిని పాకంలో నాననివ్వాలి. ఇలా చేయడం వల్ల జామున్ లు పాకాన్ని పీల్చుకుని జ్యూసీగా, మృదువుగా తయారవుతాయి.
-అంతే ఎంతో రుచికరమైన, వెరైటీ క్యారెట్ గులాబ్ జామున్ రెడీ. వీటిపై సన్నగా తరిగిన పిస్తా లేదా బాదం పప్పులను చల్లి, వేడివేడిగా లేదా ఫ్రిజ్ లో పెట్టి చల్లగా సర్వ్ చేసుకొని తింటే స్వర్గమే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications