Latest Updates
-
గోంగూర చికెన్ పచ్చడి ఇలా చేశారంటే..దాసోహం అవ్వాల్సిందే -
నాలికకు కిక్కిచ్చే చేప వెల్లుల్లి కారం..ఇలా చేశారంటే స్వర్గానికి బెత్తెడే దూరం! -
సమంత సీక్రెట్ ఇదే..రోజూ ఉదయం అలా చేస్తే లైఫ్ జిల్ జిల్ జిగా జిగా.. -
షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ! -
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో!
ఉప్మా తినడం ఇష్టం లేని వారికి రవ్వతో ఇలా చేసి పెట్టండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.!
ఉప్మా అంటే చాలా మంది ముఖం చాటేస్తారు. గోధుమ రవ్వతో చేసే ఉప్మాని కొంచెం ఇష్టంగా తిన్నా.. చల్లారిన తర్వాత తినడం ఇబ్బందే. దీంతో మిగిలిన ఉప్మాను పడేయాలంటే మనసొప్పదు. ఇకపై అలాంటి సమస్యే ఉండదు. గోధుమ రవ్వతో ఉప్మా కాకుండా బ్రేక్‌ఫాస్ట్‌లో ఈజీగా అయిపోయేలా ఇడ్లీ చేయండి. ఇంటిల్లిపాదీ లొట్టలేసుకుంటూ తినేస్తారు. ఇడ్లీలు గట్టిపడకుండా స్పాంజీగా, సాఫ్ట్‌గా వస్తాయి. గోధుమ రవ్వ ఇడ్లీ ఎలా తయారుచేయాలో చూద్దాం..

గోధుమ రవ్వ ఇడ్లీ తయారీకి కావాల్సిన పదార్థాలు
గోధుమ రవ్వ- కప్పు
ఉప్పు- అర టీస్పూన్
పెరుగు- కప్పు
నూనె- రెండు టీస్పూన్లు
పచ్చిశనగపప్పు- టీస్పూన్
మినప్పప్పు- టీస్పూన్
ఆవాలు- టీస్పూన్
జీలకర్ర- టీస్పూన్
తరిగిన అల్లం- టీస్పూన్
పచ్చిమిర్చి- రెండు
కరివేపాకు- కొద్దిగా
ఇంగువ- పావు టీస్పూన్
గోధుమ రవ్వ ఇడ్లీ తయారీ విధానం
గోధుమ రవ్వ ఇడ్లీ తయారీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని వేడయ్యాక చిన్న మంటపైన గోధుమ రవ్వను వేయించుకోవాలి. ఐదు నిమిషాల పాటు వేయించిన తర్వాత వెడల్పాటి బౌల్లోకి తీసుకోవాలి.
వంట చేసే ఓపిక లేదా? కేవలం 10 నిమిషాల్లో ఈ పచ్చిమిర్చి నువ్వుల రైస్ చేసి చూడండి, టేస్ట్ అదుర్స్!
వేయించిన రవ్వలో ఉప్పు, పెరుగు వేసి బాగా కలిపి మూతపెట్టి గంటపాటు నానబెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్‌పైన అదే పాన్‌లో నూనె వేసి వేడయిన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత తరిగిన అల్లం వేసి పచ్చివాసన పోయిన తర్వాత చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసి వేయించాలి. కరివేపాకు, ఇంగువ వేసి తాలింపు పూర్తయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఈ తాలింపును నానబెట్టిన గోధుమ రవ్వలో వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.

స్టవ్‌పైన ఇడ్లీ స్టీమర్ పెట్టుకుని గ్లాసు నీళ్లు పోసి కాగనివ్వాలి. ఇడ్లీ ప్లేట్ తీసుకుని కొద్దిగా నూనె అప్లై చేసి పిండిని ఇడ్లీల మాదిరిగా వేసుకోవాలి.
నీళ్లు కాగిన తర్వాత ఇడ్లీలను పెట్టి మీడియం మంటపైన కనీసం పావు గంట పాటు ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరో పది నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. ఇడ్లీలు సాఫ్ట్‌గా వస్తాయి.
టేస్ట్ కోసం అవసరమైతే ఇడ్లీలు వేసేటప్పుడు కొన్ని జీడిపప్పు పలుకులను కూడా వేసుకోవచ్చు. గోధుమ రవ్వతో ఉప్మా ఇష్టపడని వారి కోసం ఇలా హెల్తీగా టేస్టీగా ఇడ్లీలను చేసిపెట్టండి.. ఒకటికి రెండు తినేస్తారు. వీటిని గ్రీన్ చట్నీ, కొబ్బరి చట్నీ లేదా పల్లీ చట్నీతో తింటే ఆ అనుభూతే వేరు.
రెగ్యులర్ ఇడ్లీల కంటే ఈ ఇడ్లీలు ఎంతో రుచికరం, ఆరోగ్యం. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉన్న కారణంగా త్వరగా కడుపు నిండిన అనుభూతి కలిగిస్తుంది. జీర్ణక్రియ సాఫీగా అవుతుంది. డైట్ పాటించేవారు వీటిని భోజనంలో చేర్చుకుంటే ప్రయోజనం ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
