Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
పిల్లలకి ఖచ్చితంగా పెట్టాల్సిన ఫూల్ మఖానాతో హెల్తీ దోశ.. లంచ్ బాక్స్‌లోకి ఇష్టంగా లాగించేస్తారు.!
పిల్లలకి స్కూళ్లు ప్రారంభమయ్యాక రోజూ టిఫిన్, లంచ్‌లోకి వెరైటీలు కోరుతుంటారు. ముఖ్యంగా లంచ్ బాక్స్‌లోకి రొటీన్ అన్నం, కూర కాకుండా టేస్టీగా, హెల్తీగా, కొత్తగా ఉండాలని కోరుకుంటారు. మీ పిల్లలూ ఇలాగే ఉంటే.. వారి కోసం ఫూల్ మఖానాతో ఇలా దోశ ట్రై చేసి చూడండి. త్వరగా అయిపోవడమే కాకుండా హెల్తీగా ఉంటుంది.

ఇటీవలి కాలంలో తామర గింజలు- ఫూల్ మఖానా స్పెషల్స్‌పై జనం ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. అందుకు కారణం వీటిలో ఫ్యాట్ తక్కువ, పోషకాలు ఎక్కువగా ఉండటమే. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు, గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గడానికి, ఎముకల బలానికి, రోగ నిరోధక శక్తికి ఇలా అన్ని రకాలుగా మేలు చేస్తుంది. అందుకే రోజువారీ డైట్‌లో ఫూల్ మఖానాకి ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే వీటిని సాధారణంగా కొద్దిగా నెయ్యి వేసి రోస్ట్ చేసుకుని తినడం లేదా కర్రీ, గ్రేవీ, పాయసం ఇలా చాలా రకాలుగా చేసుకుని ఆస్వాదిస్తుంటారు.
అయితే పిల్లలు మాత్రం ఇంకా కొంచెం కొత్తగా కోరుకుంటారు. లంచ్ బాక్స్‌లోకి ఇలా కర్రీ, గ్రేవీలా చేసి పంపే టైం ఉండదు. ఇక, వర్షాకాలంలో పిల్లలు సీజనల్ వ్యాధులతో పోరాడేందుకు రోగనిరోధక శక్తి బలంగా ఉండటం చాలా అవసరం. ఈ క్రమంలో పిల్లలు ఈజీగా, ఇష్టంగా తినేలా ఈ ఫూల్ మఖానాతో ఇలా దోశ చేసి లంచ్ బాక్స్‌లోకి రెడీ చేయండి. కొంచెం కూడా వదలకుండా తినేస్తారు.
ఫూల్ మఖానా దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు
ఫూల్ మఖానా- కప్పు
అటుకులు- కప్పు
బొంబాయి రవ్వ- కప్పు
పెరుగు- కప్పు
నీళ్లు- కప్పు
ఉప్పు- రుచికి సరిపడా
అల్లం ముక్క- చిన్నది
పచ్చిమిర్చి- రెండు
ఉల్లిపాయ- ఒకటి
టమాటా- ఒకటి
క్యాప్సికమ్- ఒకటి
క్యారెట్- ఒకటి
ఫూల్ మఖానా దోశ తయారీ విధానం
ఫూల్ మఖానా దోశ తయారీ కోసం ముందు రోజే పిండి సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఇలా చేసుకోవడం ద్వారా సోడా ఉపయోగించే అవసరం ఉండదు. అప్పటికప్పుడు తయారుచేసుకోవాలనుకుంటే కొద్దిగా సోడా ఉపయోగించాల్సి ఉంటుంది. సోడా వాడటం ఇష్టం లేని వారు ముందు రోజు రాత్రే సిద్ధం చేసుకోవడం ద్వారా దోశలు టేస్టీగా వస్తాయి.
ముందుగా ఫూల్ మఖానాని కొద్దిగా నెయ్యి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు వాటిని ఒక మీడియం బౌల్‌లో తీసుకోవాలి. ఇందులోనే అటుకులు, రవ్వ, పెరుగు వేసి కలపాలి. కొద్దిగా నీళ్లు, ఉప్పు వేసి కలిసి పది నిమిషాల పాటు నాననివ్వాలి. పది నిమిషాల తర్వాత ఇందులో చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు.
మరుసటి రోజు ఉదయం దోశ తయారుచేసుకునే ముందు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక చిన్న గిన్నెలో తీసుకోవాలి. ఇందులో క్యారెట్ తురుము వేసి కలుపుకోవాలి.
ఇప్పుడు స్టవ్‌పైన దోశ పెనం పెట్టి వేడయ్యాక.. ఫూల్ మఖానా పిండితో పెనంపై చిన్నచిన్నగా దోశలు కొంచెం మందంగా పోసుకోవాలి. వీటిపైన ఉల్లిపాయ స్టఫ్ వేసి కొద్దిగా నూనె చల్లాలి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా అలాగే కాల్చుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని దోశల్లాగా చేసుకోవాలి.
అంతే ఆరోగ్యకరమైన ఫూల్ మఖానా దోశ రెడీ. లంచ్‌లోకి అప్పుడప్పుడు అన్నం వద్దని పిల్లలు మారాం చేసినప్పుడు ఇలా త్వరగా అయిపోయేలా ఈ రెసిపీ తయారు చేయండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి ఆస్వాదిస్తారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గాను, లేదా సాయంత్రం సమయంలో స్నాక్స్‌గానూ వీటిని తీసుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications