Latest Updates
-
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.?
ఉక్కు లాంటి ఎముకల కోసం.. రోజుకో కప్పు మిక్స్ వెజ్ రాగి సూప్..ఎలా చేసుకోవాలంటే..
ప్రస్తుత కాలంలో ముఖ్యంగా మిల్లెట్స్ వినియోగం బాగా పెరిగింది. ఈ చిరుధాన్యాలలో రాగులు అత్యంత పోషక విలువలు కలిగిన ఆహారంగా చెప్పవచ్చు. రాగులతో సాధారణంగా జావ, సంగటి లేదా రొట్టెలు చేసుకుంటారు.
కానీ సాయంత్రం లేదా ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఆరోగ్యకరమైన, రుచికరమైన ఏదైనా తీసుకోవాలనుకుంటే మిక్స్ వెజ్ రాగి సూప్ అద్భుతమైన ఆప్షన్. ఇది కేవలం ఆకలిని తీర్చడమే కాకుండా, శరీరానికి కావాల్సిన కాల్షియం, ప్రోటీన్, విటమిన్లను సమృద్ధిగా అందిస్తుంది. మిక్స్ వెజ్ రాగి సూప్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
రాగి పిండి: 2 టేబుల్ స్పూన్లు
నీళ్లు: 3-4 కప్పులు
క్యారట్ ముక్కలు: 2 టేబుల్ స్పూన్లు
బీన్స్ ముక్కలు: 2 టేబుల్ స్పూన్లు
స్వీట్ కార్న్: 2 టేబుల్ స్పూన్లు
పచ్చి బఠానీలు: 2 టేబుల్ స్పూన్లు
ఉల్లికాడలు: 2 టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు: 3-4
అల్లం: 1 చిన్న ముక్క
మిరియాల పొడి: అర టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
నెయ్యి లేదా నూనె: 1 టీస్పూన్
నిమ్మరసం: 1 టీస్పూన్
కొత్తిమీర: గార్నిష్ కోసం
తయారీ విధానం
-ముందుగా ఒక చిన్న గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల రాగి పిండిని తీసుకోండి. అందులో పావు కప్పు నీళ్లు పోసి, ఉండలు లేకుండా బాగా కలిపి పక్కన పెట్టుకోండి.
-స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె లేదా పాన్ పెట్టుకోండి. అందులో ఒక టీస్పూన్ నెయ్యి లేదా నూనె వేసి వేడి చేశాక అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం ముక్కలు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాక అందులో ఉల్లికాడల (స్ప్రింగ్ ఆనియన్స్) తెలుపు భాగం వేసి వేయించాలి.
-ఇప్పుడు సన్నగా తరిగిన క్యారట్, బీన్స్, స్వీట్ కార్న్, పచ్చి బఠానీలను పాన్ లో వేసి 2 నిమిషాల పాటు వేయించాలి. కూరగాయలు మరీ మెత్తగా అవ్వకూడదు, కొంచెం క్రంచీగా ఉంటేనే సూప్ బాగుంటుంది. ఇప్పుడు అందులో 3 కప్పుల నీళ్లు పోసి, రుచికి సరిపడా ఉప్పు వేసి, నీటిని మరిగించాలి. కూరగాయలు సగం ఉడికే వరకు సుమారు 3-4 నిమిషాలు మరిగించండి.
-నీళ్లు మరుగుతున్నప్పుడు మంటను తగ్గించి, ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి నీళ్ళను ఇందులో నెమ్మదిగా పోయాలి. పోస్తున్నప్పుడు గరిటెతో కలుపుతూనే ఉండాలి.
-రాగి పిండి పచ్చి వాసన పోయి, సూప్ గ్లాసీ టెక్చర్ (మెరుస్తూ) వచ్చే వరకు ఉడికించాలి. మీకు సూప్ మరీ చిక్కగా అనిపిస్తే కొంచెం వేడి నీళ్లు కలుపుకోవచ్చు.
-సూప్ బాగా ఉడికాక, స్టవ్ ఆపే ముందు మిరియాల పొడి వేసి కలపాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్ గ్రీన్స్ చల్లి దించేయాలి.
-వేడి వేడి సూప్ ను బౌల్ లోకి తీసుకుని, కావాలంటే కొంచెం నిమ్మరసం పిండుకోండి. అంతే మిక్స్ వెజ్ రాగి సూప్ రెడీ.
-బరువు తగ్గాలనుకునే వారికి,పిల్లల ఎదుగుదలకు,వయసు పైబడిన వారిలో వచ్చే ఎముకల బలహీనత సమస్యను తగ్గించడానికి రాగి సూప్ సహాయపడుతుంది. పాలు ఇష్టపడని వారికి ఇది కాల్షియం అందించే గొప్ప ప్రత్యామ్నాయం
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications