Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
చద్దన్నంలో ఈ చేపలు పెట్టుకొని తింటే.. జన్మకి ఇంకేదీ అక్కర్లేదనిపిస్తుంది,ఎలా చేయాలంటే
ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండాలి అంటే తీసుకునే ఆహారమే మెయిన్. తీసుకునే ఫుడ్ ఆరోగ్యమైనదయితే జీవితంలో హాస్పిటల్స్ కి పెద్దగా వెళ్లాల్సిన అవసరమే ఉండదు. పాతకాలంలో మన పెద్దలు గొడ్డులా కష్టపడేవారు..దీనికి శక్తి వారు తీసుకున్న ఆహారం వల్లనే వచ్చేది..కల్తీ లేని ఆహారం తినడం వల్లనే వారు ఎలాంటి అనారోగ్యాలు లేకుండా మంచి జీవితాన్ని గడిపారు. అయితే అలాంటి ఆహారాల్లో చద్దన్నం ఒకటి. చదన్నంతో పాటు ఫ్రై చేసిన చిన్న చేపలను నంజుకొని తింటే కోటి రూపాయలు ఇచ్చినా అలాంటి టేస్ట్ రుచి చూడలేరు. చద్దన్నం,చిన్న చేపల ఫ్రైని ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకోవచ్చు. చద్దన్నం,చిన్న చేపల ఫ్రై ఇంట్లో ఎలా తయారుచేసుకోవాలి,దీని తయారీకి కావలసిన పదార్థాలు ఏంటో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
చద్దన్నం
ఉల్లిపాయ
పచ్చిమిర్చి
చిన్న చేపలు(పక్కీలు)
ఉప్పు
కారం
కరివేపాకు
పెరుగు
అల్లం పేస్ట్

తయారీ విధానం
-ముందుగా ఓ గిన్నెలో చద్దం వెసుకోవాలి. అన్నం మునిగివేరకు అందులో మంచినీళ్లు పోసుకోవాలి. కావాలనుకుంటే గంజి కూడా పోసుకోవచ్చు.
-ఇప్పుడు అందులోనే సగం గ్లాస్ గోరువెచ్చని పాలను పోయండి.
-తర్వాత అందులోనే రెండు చెంచాల పెరుగు కూడా వేసి మొత్తం కలిసేలా బాగాచేత్తో కలపండి.
-తర్వాత అందులోనే నాలుగు పచ్చిమిర్చి అలాగే వేసి, ఒక పెద్ద ఉల్లిపాయను నాలుగు ముక్కలుగా కట్ చేసి వేయండి.
-ఇప్పుడు గిన్నె మీద మూత పెట్టి రాత్రంతా అలాగే వదిలేయండి. తెల్లవారిన తర్వాత దీన్ని అలాగే తినవచ్చు.
-అయితే చద్దన్నంలో నంచుకోడానికి చిన్న చేపలు చాలా బాగుంటాయి. ఇందుకోసం పక్కీలు(చిన్న చేపలు)ను తల,తోక కట్ చేసి ఓ గిన్నెలో వేసి శుభ్రంగా కడగాలి.
-తర్వాత అందులో ఉప్పు,కారం,అల్లం పేస్ట్ వేసి బాగా కలపాలి.
కేరళ స్పెషల్ పుట్టు..బ్రేక్ ఫాస్ట్ లోకి సూపర్,ఆరోగ్యం కూడా..ఎలా చేయాలంటే
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దాని మీద పెనం పెట్టి మీద కొంచెం ఆయిల్ పోసి వేడయ్యాక అందులో మూడు కరివేపాకు రెబ్బలు పెట్టి కలుపుకున్న చేపలను పెనం మీద వేసి కాల్చుకోవాలి.
-రెండు వైపులా బాగా కాల్చిన చేపలను ఓ ప్లేట్ లోకి తీసుకోండి.
-ఇప్పుడు చద్దన్నం గిన్నెలో రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోండి. తర్వాత ఈ చద్దన్నంతో చేపలు నంజుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications