Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
నాన్‌వెజ్ రుచిని మరిపించే మష్రూమ్ కర్రీ.. గ్రేవీ ఇలా చేశారంటే అద్భుతః అనాల్సిందే.!
కేలరీలు తక్కువ, ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే పుట్టగొడుగుల కూర అంటే ఇష్టపడని వారుండరు. మష్రూమ్ కర్రీ ఆకృతిని తలచుకుంటేనే కొందరికి నీళ్లూరుతుంటాయి. ఈ కర్రీని సరైన విధానంలో చేశారంటే దీని ముందు చికెన్, మటన్ కూడా దిగదుడుపే. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరి ఆరోగ్యానికి దోహదపడే ఈ పుట్టగొడుగుల వంటకాన్ని నెలలో రెండు సార్లయినా తింటే ఎంతే మేలు.

వెజ్ అయినా నాన్ వెజ్ అయినా గ్రేవీ ఎక్కువగా, రుచిగా ఉండాలంటే చేసే విధానం సరైనదిగా ఉండాలి. అప్పుడే అన్నంలోకి అయినా చపాతీలోకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. భోజనం చేసిన సంతృప్తి కలుగుతుంది. ఈ పుట్టగొడుగుల కూరను కూడా అంతే ఇష్టంగా, రుచిగా తినాలంటే గ్రేవీ సరిగ్గా కుదరాలి. ఆకలి లేదు అనే వారు సైతం ఆ సువాసనకే మరో రెండు ముద్దలు లాగించేస్తారు. మరి హెల్తీ, టేస్టీ అయిన మష్రూమ్ గ్రేవీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..
మష్రూమ్ గ్రేవీ కర్రీకి కావాల్సిన పదార్థాలు
గ్రేవీ కోసం
జీడిపప్పు- రెండు టేబుల్ స్పూన్లు
మసాలా దినుసులు- టీస్పూన్
ఎండు కొబ్బరి ముక్కలు- మూడు మీడియం సైజు
టమాటా- మీడియం సైజు ఒకటి
పెరుగు- రెండు టేబుల్ స్పూన్లు
కర్రీ కోసం
పుట్టగొడుగులు- 200 గ్రాములు
నూనె- మూడు టేబుల్ స్పూన్లు
గరం మసాలా దినుసులు- టీస్పూన్
జీలకర్ర- అర టీస్పూన్
తరిగిన ఉల్లిపాయ ముక్కలు- ముప్పావు కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్- టీస్పూన్
ఉప్పు- రుచికి సరిపడా
కారం- ఒకటిన్నర టేబుల్ స్పూన్
పసుపు- పావు టీస్పూన్
ధనియాల పొడి- టీస్పూన్
జీలకర్ర పొడి- టీస్పూన్
పచ్చిమిర్చి- రెండు
కరివేపాకు- కొద్దిగా
కొత్తిమీర- కొద్దిగా
మష్రూమ్ గ్రేవీ కర్రీ తయారీ విధానం
ముందుగా గ్రేవీ కోసం సిద్ధం చేసుకున్న జీడిపప్పు, మసాలా దినుసులు, పెరుగు, టమాటా ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుని పేస్ట్‌లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
పుట్టగొడుగులను నీళ్లలో శుభ్రంగా కడిగిన తర్వాత ఉడికించుకోవాలి. తర్వాత వాటిని మళ్లీ కడిగి ఒక్కో దానిని రెండు ముక్కలుగా పొడవుగా కట్ చేసుకోవాలి.

ఇప్పుడు స్టవ్‌పైన పాన్ పెట్టి వేడయ్యాక నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక మసాలా దినుసులు, జీలకర్ర వేసి వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి రంగు మారేవరకు వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి.
తర్వాత మసాలా పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో ఉప్పు, కారం, పసుపు వేసి కలుపుకోవాలి. గ్రేవీ దగ్గరకు అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పుట్టగొడుగులను వేసి కలుపుకోవాలి.
ఇవి వేగిన తర్వాత ముప్పావు కప్పు నీళ్లు పోసి ఉడికించుకోవాలి. కర్రీ ఉడుకుతుండగా అందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి వేసి మరోసారి కలిపి మూత పెట్టి ఉడికించాలి.
నూనె పైకి తేలుతూ ఉడుకుతున్నప్పుడు చివర్లో కొత్తిమీర చల్లి గార్నిష్ చేసుకోవాలి. అంతే హెల్తీ అండ్ టేస్టీ మష్రూమ్ గ్రేవీ కర్రీ రెడీ. వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి ఈ కాంబినేషన్ సూపర్‌గా ఉంటుంది.
పుట్టగొడుగుల్లో ఉండే సెలీనియం, బీటా-గ్లూకాన్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శరీరంలో ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. పొటాషియం, ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో దోహదపడుతుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉండటంతో త్వరగా కడుపు నిండిన భావనను కలిగించి శరీర బరువును నియంత్రణలో ఉంచుతుంది. పుట్టగొడుగుల్లోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. విటమిన్ డి సమృద్ధిగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications