Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
చుక్క ఆయిల్ లేదు,బెల్లం-చక్కెర లేకుండానే సూపర్ హెల్తీ రాగి డ్రై ఫ్రూట్ లడ్డు..ఎలా చేసుకోవాలంటే
రాగి డ్రై ఫ్రూట్ లడ్డూలు కేవలం రుచికరమైనవే కాదు, పోషకాలతో నిండిన అద్భుతమైన స్నాక్. ఇవి పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ మంచివి. రాగి, డ్రై ఫ్రూట్స్ కలయిక ఈ లడ్డూలను పోషకాహార శక్తి కేంద్రంగా మారుస్తుంది. పెరుగుతున్న పిల్లలకు, వృద్ధులకు, గర్భిణులకు ఇది ఎంతో మేలు చేస్తుంది. వ్యాయామం చేసేవారికి, ఎక్కువ శారీరక శ్రమ చేసేవారికి ఇది అద్భుతమైన స్నాక్. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు లేదా మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్నవారికి ఒక ఆరోగ్యకరమైన ఎంపిక. ఈ లడ్డూలను తయారు చేయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది, ఎటువంటి కృత్రిమ తీపి పదార్థాలు అవసరం లేదు. చక్కెర,బెల్లం కూడా లేకుండానే డ్రై ఫ్రూట్ రాగి లడ్డును ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
రాగి డ్రై ఫ్రూట్ లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు
-బాదంపప్పు
-జిడిపప్పు
-రాగిపిండి
-పుచ్చ గింజలు
-గుమ్మడి గింజలు
-కొబ్బరి తురుము
-నువ్వులు
-పొద్దు తిరుగుడు గింజలు
-నెయ్యి
-ఖర్జూరం
-యాలకల పొడి
-తేనె

రాగి డ్రై ఫ్రూట్ లడ్డు తయారీ విదానం
-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చెయ్యాలి.
-నెయ్యి వేడయ్యాక అందులో 15 బాదంపప్పులు, 12 జీడిపప్పులు, 1 టేబుల్ స్పూన్ పొద్దు తిరుగుడు గింజలు, 1 టేబుల్ స్పూన్ పుచ్చ గింజలు, 1 టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు వేసి బాగా వేయించాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ నువ్వులు,పావు కప్పు కొబ్బరి తురుము వేసి తక్కువమంట మీద 2 నిమిషాలు వేయించాలి.
-బాగా వేగిన వీటన్నింటిని మిక్సీ గిన్నెలో వేసి మెత్తని పొడిగా గ్రైండ్ చేయండి.
-ఇప్పుడు తీపి కోసం చక్కెర,బెల్లం వాడకుండా 12 విత్తనాలు తొలగించిన ఖర్జూరాలను లేదా డేట్స్ ని మిక్సీ గిన్నెలో వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేయండి. ఖర్జూరాలు సహజంగా తీపిగా ఉండటమే కాకుండా పీచు పదార్థం, విటమిన్లు, మినరల్స్ ను కూడా అందిస్తాయి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 150 గ్రాముల రాగిపిండి వేసి 2-3 నిమిషాలు బాగా కలుపుతూ వేయించాక ఇందులో పావుకప్పు నెయ్యి వేసి బాగా కలపి మిక్సీలో వేసి చేసుకున్న ఖర్జూర పేస్ట్ ను వేసి పిండికి పట్టేలా 2-3 నిమిషాలు బాగా కలుపుకోండి.
-తర్వాత అందులోనే మిక్సీలో వేసి చేసేకున్న డ్రై ఫ్రూట్ పొడిని కూడా వేసి మొత్తం అన్నీ బాగా కలిసేలా కలపాలి.
-కావాలనుకుంటే ఇందులో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల తేనె,చిటికెడు యాలకల పొడి కూడా వేసి కలుపుకోవచ్చు.
-తర్వాత చేతికి నెయ్యి రాసుకొని కలిపిన పిండి మిశ్రమాన్ని కొంచెం కొంచెం చేతుల్లోకి తీసుకొని లడ్డూలా చుట్టుకోండి. అంతే సూపర్ టేస్టీ,హెల్తీ రాగి డ్రై ఫ్రూట్ లడ్డూ రెడీ.
-ఈ లడ్డూలను గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేస్తే 10 రోజుల వరకు తాజాగా ఉంటాయి. ఫ్రిడ్జ్ లో నిల్వ చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
