Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ
కొంతమంది ఉల్లి, వెల్లుల్లి వంటల్లో ఉపయోగించరు. కానీ ఈ రెండూ లేకుండా కొన్ని వంటలు రుచికరంగా ఉండవు. ముఖ్యంగా దోశపైన ఈ కాంబినేషన్ లేనిదే కొందరికి రుచించదు. అయితే ఉల్లి, వెల్లుల్లి లేకుండానే సోయాతో రుచికరంగా, ఆరోగ్యకరంగా బార్లీ దోశను చేసుకోవచ్చు. ఇది డయాబెటిస్ ఉన్నవారికి కూడా మేలు చేస్తుంది.

ఇటీవలి కాలంలో ఎక్కువగా దోశల్లో బియ్యం వాడటం తగ్గించేస్తున్నారు. ఆరోగ్యకరమైన రాగులు, పెసర్లు, మినప్పప్పు, మిల్లెట్లు, చిరు ధాన్యాలు ఇలా వీటితో దోశలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా షుగర్ ఉన్నవారు టిఫిన్స్, లంచ్ విషయంలో ప్రత్యేకంగా మెనూ కేటాయించుకుంటున్నారు. ఇలాంటి వారికి ప్రొటీన్ పుష్కలంగా ఉన్న, ఫైబర్ నిండిన హెల్తీ దోశను ఎలా చేసుకోవాలో చూద్దాం.
సోయా చంక్స్‌తో ఆరోగ్యకరమైన బార్లీ దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు
బార్లీ దోశ కోసం కావాల్సిన పదార్థాలు
బార్లీ గింజలు- కప్పు
పెసరపప్పు- పావు కప్పు
మెంతులు- టీ స్పూన్
బార్లీ దోశ తయారీ విధానం
బార్లీ దోశ కోసం ముందు రోజు రాత్రే ఒక బౌల్లో బార్లీ గింజలు, పెసరపప్పు, మెంతులు అన్నీ వేసి శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇప్పుడు అందులో రెండు ఎండు మిర్చి వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని కాసేపు పక్కన పెట్టుకోవాలి.
సోయా చంక్స్ వెజ్ ఖీమాకి కావాల్సిన పదార్థాలు
సోయా చంక్స్- 100 గ్రాములు
టమాటాలు- మూడు- మీడియం సైజు
పచ్చిమిర్చి- 4
అల్లం- చిన్న ముక్క
క్యాబేజ్- పావు కప్పు
కరివేపాకు- కొద్దిగా
కొత్తిమీర- కొద్దిగా
జీలకర్ర- టీస్పూన్
ఉప్పు- టీస్పూన్
కారం- టీస్పూన్
పసుపు- పావు టీస్పూన్
గరం మసాలా- అర టీస్పూన్
నూనె- మూడు టీస్పూన్లు
వెజ్ ఖీమా తయారీ విధానం
ముందుగా సోయా చంక్స్‌ని వేడి నీళ్లలో కాసేపు నానబెట్టి నీళ్లను గట్టిగా పిండుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు పాన్ స్టవ్‌పైన పెట్టి నూనె పోసి వేడయ్యాక పచ్చిమిర్చి, క్యాబేజ్ ముక్కలు వేసి వేయించాలి. ఇందులో అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేయించాక టమాటా ముక్కలు వేసి కాసేపు ఉడికించాలి. ఇప్పుడు అందులో పసుపు, కారం, ఉప్పు వేసి మరోసారి కలపాలి. చివరిగా సోయాచంక్స్ వేసి వేయించుకోవాలి. అవసరమైతే కొద్దిగా కసూరిమేతి వేసి పచ్చివాసన పోయేవరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టఫ్‌ను ఒక గిన్నెలో వేసుకోవాలి.

సోయా చంక్స్ వెజ్ ఖీమా బార్లీ దోశ తయారీ విధానం
ఇప్పుడు స్టవ్‌పైన దోశ పాన్ పెట్టుకుని వేడయ్యాక బార్లీ దోశను పల్చగా వేసుకోవాలి. దీనిపైన సోయా చంక్స్ వెజ్ ఖీమా స్టఫ్ వెడల్పుగా పరుచుకుని కొద్దిగా నూనె చల్లుకోవాలి. దోశ బాగా కాలిన తర్వాత తీసేయడమే. ఇలాగే అన్ని దోశలు వేసుకోవాలి. అంతే రుచికరమైన, ఆరోగ్యకరమైన సోయా చంక్స్ వెజ్ ఖీమా బార్లీ దోశ రెడీ. ఈ దోశను పల్లీ చట్నీ లేదా అల్లం చట్నీతో తింటే రుచి అదిరిపోతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications