Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లోకి నూనె లేకుండా ఆరోగ్యకరంగా తినాలనుకుంటే ఇడ్లీలు మేలనుకుంటాం. కానీ వీటిలో కార్బొహైడ్రేట్లు పుష్కలంగా అంటాయి. అందుకే చాలా మంది డైట్ పాటించేవారు వీటిని తినడానికి కూడా ఆలోచిస్తారు. అలాంటి వారికే కాదు రోజంతా యాక్టివ్‌గా ఉండేందుకు, బరువు తగ్గేందుకు హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అంటే అది ఆవిరితో చేసిన పొట్టు మినప్పప్పు కుడుములు. టిఫిన్‌లోకి ఒక్కటి తిన్నా చాలు.. నీరసం మీ దరి చేరదు. పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు సింపుల్‌గా ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం..

నూనెతో, నీళ్లతో ఉడికించిన వంటకాలతో పోలిస్తే ఆవిరితో ఉడికించిన వంటకాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కొంచెం కూడా నూనె లేకుండా ఆవిరిపైన ఉడికించడం వల్ల వాటిలోని విటమిన్స్, మినరల్స్, పోషకాలు బయటకు పోకుండా ఉండటంతో ఆహారం ద్వారా శరీరంలోకి చేరి జీవక్రియను మెరుగుపరుస్తుంది. అందుకే మన పూర్వీకులు అంత బలంగా ఉండేవారు. నేటి జీవనశైలి మార్పులు, అనారోగ్యాలు ప్రబలుతున్న కారణంగా మళ్లీ ఆవిరితో ఉడికించిన వంటకాలకు డిమాండ్ పెరుగుతోంది. ఆవిరి కుడుములు, ఇడ్లీలను ఇష్టంగా లాగించేస్తున్నారు. ఇక, పొట్టు మినప్పప్పులో ఉండే పోషకాల నిధులు అంతా ఇంతా కాదు. అచ్చంగా వీటితోనే టిఫిన్ చేసుకున్నట్లయితే మీ ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు తయారీకి కావాల్సిన పదార్థాలు
పొట్టు మినప్పప్పు- అరకేజీ
ఉప్పు- రుచికి సరిపడా
ముందుగా పొట్టు మినప్పప్పును బాగా కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయాన్నే మరోసారి కడిగి నీళ్లు పోయకుండా మెత్తగా, గట్టిగా రుబ్బుకోవాలి. మధ్యమధ్యలో ఉప్పు సరిచూసుకుంటూ వేసుకోవాలి. ఈ పిండి మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పది నిమిషాల పాటు పక్కన పెట్టండి.
ఇప్పుడు ఒక వెడల్పాటి కుండలో సగానికి నీళ్లు పోసుకోవాలి. తెల్లటి కాటన్ క్లాత్ తీసుకుని దానిపైన పరిచి సన్నటి పీలికతో గట్టిగా కట్టాలి.
దీనిపైన పెద్ద ఇడ్లీ మాదిరిగా పోసుకోవాలి. అదే క్లాత్‌తో పై నుంచి కప్పుకోవాలి. మూత పెట్టేసి స్టవ్‌పైన లేదా కట్టెల పొయ్యి పైన పెట్టి 15 లేదా 20 నిమిషాల పాటు మీడియం మంటపైన ఉడికించుకోవాలి.
కుడుములు ఉడికాయా లేదా అని చెక్ చేయడానికి చాకుతో మధ్యలో పొడిచి చూసినట్లయితే అంటుకోకుండా వస్తుంది. అప్పుడు కుడుములు పూర్తిగా ఉడికిననట్లు నిర్ధారించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి.

ఈ ఆవిరి కుడుములను బొంబాయి చట్నీతో తింటే దానిని మించిన రుచి మరొకటి ఉండదు. ఈ చట్నీని సింపుల్‌గా ఎలా చేసుకోవాలంటే..
ఆవిరి కుడుముల్లో బొంబాయి చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు
అల్లం ముక్కలు- టీస్పూన్
కరివేపాకు- రెండు రెబ్బలు
పచ్చిశనగపప్పు- టీస్పూన్
ఉల్లిపాయ- ఒకటి
పచ్చిమిర్చి- ఒకటి
టమాటా- ఒకటి
మినప్పప్పు- టీస్పూన్
ఆవాలు- టీస్పూన్
జీలకర్ర- టీస్పూన్
శనగపిండి- మూడు టీస్పూన్లు
నూనె- మూడు టీస్పూన్లు
ఉప్పు- రుచికి సరిపడా
బొంబాయి చట్నీ తయారీ విధానం
ముందుగా స్టవ్‌పైన పాన్ పెట్టుకుని అందులో నూనె వేసి కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసి వేయించాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి.
ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడు చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మగ్గనివ్వాలి. గ్లాసు నీళ్లు పోసి మరగనివ్వాలి.

తర్వాత శనగపిండిలో నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి పాన్‌లో పోసి ఉండలు కట్టకుండా మరోసారి కలుపుకోవాలి. 20 నిమిషాల పాటు సన్నని మంటపైన బాగా మరగనివ్వండి.
బొంబాయి చట్నీ లూజ్‌గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. చల్లారిన తర్వాత కొద్దిగా గట్టిపడుతుంది. చట్నీ రెడీ అయిపోయినట్లే. ఆవిరి కుడుములుతో వీటిని సర్వ్ చేసుకోవడమే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications