Latest Updates
-
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
పోషకాల గని మునగాకుతో కరకరలాడే పూరీలు.. తయారీ విధానం ఇదే!
మునగకాయ మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో, మునగ ఆకులు కూడా అంతకంటే ఎక్కువ ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఆయుర్వేదంలో మునగాకును పోషకాల గని అని పిలుస్తారు. ఇందులో ఐరన్, విటమిన్-ఎ, విటమిన్-సి, కాల్షియం, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. వారానికి కనీసం రెండుసార్లు మునగాకును మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తహీనత దూరమవుతుంది, శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
అయితే సాధారణంగా మునగాకును వేపుడుగానో, పప్పులోనో, సాంబార్ లోనో వేసుకుని తింటుంటాం. కానీ ఆ వగరు రుచి వల్ల పిల్లలు, కొంతమంది పెద్దలు దీన్ని తినడానికి అస్సలు ఇష్టపడరు. అలాంటి వారి కోసం ఒక అద్భుతమైన, రుచికరమైన వంటకమే మునగాకు పూరీ. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు స్పెషల్ బ్రేక్ ఫాస్ట్ గా దీనిని తయారు చేసి పెట్టవచ్చు. ఇది సాధారణ పూరీల కంటే ఎంతో ఆరోగ్యకరమైనది.

మునగాకు పూరీ తయారీకి కావలసిన పదార్థాలు
మునగాకులు - ఒక గుప్పెడు
పచ్చిమిర్చి - 2
అల్లం - చిన్న ముక్క
పిండి కోసం:
గోధుమ పిండి - 2 కప్పులు
నూనె - 2 టీస్పూన్లు
జీలకర్ర - అర టీస్పూన్
ఉప్పు - రుచికి తగినంత
నీళ్లు - పిండి కలపడానికి సరిపడా
నూనె - డీప్ ఫ్రై చేయడానికి
మునగాకు పూరీ తయారీ విధానం
-ముందుగా ఒక మిక్సీ జార్ లో శుభ్రంగా కడిగిన గుప్పెడు మునగాకులు, చిన్న అల్లం ముక్క, రెండు పచ్చిమిర్చి వేయాలి. కొద్దిగా నీళ్లు పోసి, వీటన్నింటినీ మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఇదే మన పూరీకి చక్కటి రంగును, రుచిని ఇచ్చే స్పెషల్ మసాలా.
-ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో 2 కప్పుల గోధుమ పిండిని వేయండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అర టీస్పూన్ జీలకర్ర, 2 టీస్పూన్ల నూనె వేసి బాగా కలపాలి. తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న మునగాకు-అల్లం మసాలా పేస్ట్ ను ఈ పిండిలో వేసి కలపాలి. కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ, పిండిని పూరీ పిండిలా మృదువుగా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా లేదా మరీ పల్చగా ఉండకూడదు.
-కలుపుకున్న పిండిపై ఒక మూత పెట్టి సుమారు 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి బాగా నానుతుంది.
-పది నిమిషాల తర్వాత పిండిని తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. పూరీ పీటపై కొద్దిగా నూనె రాసి, ఈ ఉండలను గుండ్రంగా, మరీ మందంగా లేకుండా ఒత్తుకోవాలి.
-స్టవ్ ఆన్ చేసి, కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా వేడెక్కాక, ఒత్తి పెట్టుకున్న పూరీలను అందులో వేయాలి. రెండు వైపులా తిప్పుతూ పూరీ బాగా ఉబ్బి, కరకరలాడే బంగారు రంగులోకి వచ్చేంత వరకు వేయించి తీసుకోవాలి.
-అంతే ఎంతో రుచికరమైన, వేడివేడి మునగాకు పూరీ రెడీ. ఈ స్పెషల్ పూరీలను వెజ్ కుర్మా, బంగాళదుంప కూర లేదా మీకు ఇష్టమైన చట్నీతో ఆస్వాదించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications