Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం..రంగు రంగుల కొబ్బరి బీట్ రూట్ రైస్..ఎలా చేసుకోవాలంటే..
మధ్యాహ్నం లంచ్ బాక్స్ లోకి రోజూ ఒకే రకమైన కూరలు, అన్నం పెడితే పిల్లలు బోర్ ఫీలవుతుంటారు. పైగా లంచ్ బాక్స్ తెరవకుండానే ఇంటికి తిరిగి తెచ్చేస్తుంటారు. ఇక పిల్లలకు కూరగాయలు తినిపించడం అనేది తల్లులకు ఒక పెద్ద యుద్ధం లాంటిదే అని చెప్పవచ్చు. ముఖ్యంగా బీట్ రూట్ వంటి కూరగాయలంటే పిల్లలు అస్సలు ఇష్టపడరు. వాటిని వేయించి పెట్టినా, కూర చేసినా తినడానికి మారం చేస్తారు.
కానీ బీట్ రూట్ లో రక్తాన్ని పెంచే గుణాలు, ఎన్నో పోషకాలు ఉంటాయని మనకు తెలుసు. మరి పిల్లలు ఇష్టంగా తినేలా, అదే సమయంలో వారికి ఆరోగ్యాన్ని అందించేలా ఏదైనా వంటకం ఉంటే బాగుంటుంది అంటే అదే కొబ్బరి బీట్ రూట్ రైస్. కొబ్బరిలోని కమ్మదనం, బీట్ రూట్ లోని పోషకాలు కలిసి ఈ రైస్ ని అద్భుతంగా మారుస్తాయి. కొబ్బరి బీట్ రూట్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
వండిన అన్నం: 1 కప్పు
బీట్ రూట్ ముక్కలు: అర కప్పు
పచ్చి కొబ్బరి ముక్కలు: అర కప్పు
నూనె: 2 టీస్పూన్లు
ఆవాలు: అర టీస్పూన్
మినపప్పు: 1 టీస్పూన్
వేరుశనగలు (పల్లీలు): 1 టేబుల్ స్పూన్
జీడిపప్పు: 10
కరివేపాకు: 1 రెమ్మ
పచ్చిమిర్చి: 1
ఉప్పు: రుచికి సరిపడా
నిమ్మరసం: 1 టీస్పూన్
కొత్తిమీర: కొద్దిగా
తయారీ విధానం
-ముందుగా అన్నాన్ని వండుకుని, ఒక వెడల్పాటి ప్లేట్ లో వేసి చల్లార్చుకోవాలి. అన్నం మెతుకులు అతుక్కోకుండా పొడిపొడిగా ఉంటేనే ఈ రైస్ రుచిగా ఉంటుంది.
-ఒక మిక్సీ జార్ లో బీట్ రూట్ ముక్కలు,పచ్చి కొబ్బరి ముక్కలు వేసి వీటిని మరీ మెత్తగా పేస్ట్ లా కాకుండా, కొంచెం కచ్చాపచ్చాగా ఉండేలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో నూనె వేసి వేడి చేసి ఆవాలు,మినపప్పు, వేరుశనగలు, జీడిపప్పు వేసి దోరగా, బంగారు రంగు వచ్చేవరకు వేయించండి. తర్వాత కరివేపాకు,చీల్చిన పచ్చిమిర్చి వేసి వేయించండి.
-ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న బీట్ రూట్ కొబ్బరి మిశ్రమాన్ని బాండీలో వేయండి. రుచికి సరిపడా ఉప్పు చల్లి సన్నని మంటపై సుమారు 3 నుండి 4 నిమిషాల పాటు వేయించాలి. బీట్ రూట్ లోని పచ్చి వాసన పోయే వరకు వేయిస్తే సరిపోతుంది.
-వేగిన మిశ్రమంలో ముందుగా చల్లార్చి పెట్టుకున్న అన్నాన్ని వేసి నెమ్మదిగా కలపాలి. అన్నం విరిగిపోకుండా జాగ్రత్తగా టాస్ చేయండి. స్టవ్ కట్టేసిన తర్వాత బాండీలో కొంచెం నిమ్మరసం పిండి, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని ఒకసారి కలపండి.
-అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన, కంటికి ఇంపుగా కనిపించే కొబ్బరి బీట్ రూట్ రైస్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications