సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి!

Posted By:

సేమియాతో సాధారణంగా చాలామంది పాయసం లేదా ఉప్మా వంటివి చేసుకుంటారు. అయితే ఈసారి వెరైటీగా సేమియా బెల్లం స్వీట్ ట్రై చేయండి. ఈ స్వీట్ రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పైగా ఇది చేయడం కూడా చాలా సులువు. మరి ఈ అద్భుతమైన స్వీట్ ఎలా చేయాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు

-సేమియా
-బెల్లం
-నీళ్లు
-జీడిపప్పు
-నెయ్యి

Healthy Tasty How to Make the Perfect Semiya Jaggery Burfi in Minutes

తయారీ విధానం

-ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిమీద ఒక కడాయి లేదా గిన్నె పెట్టుకోండి. అందులో 1 కప్పు(300 గ్రాములు) బెల్లం వేసుకోండి. ఇందులోనే 1 కప్పు నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించాలి. బెల్లం పాకం రానక్కర్లేదు.జస్ట్ కరిగిస్తే సరిపోతుంది.

-తర్వాత స్టవ్ మీద మరో బాండీ పెట్టుకొని అందులో 1 టీస్పూన్ నెయ్యి వేసి వేడి చెయ్యాలి. నెయ్యి వేడెక్కాక అందులో 10 జీడిపప్పు పలుకులు వేసి బాగా దోరగా వేయించుకున్నాక తీసి పక్కన పెట్టుకోండి.

-తర్వాత బాండీలోని అదే నెయ్యిలో 1 కప్పు(200 గ్రా) సేమియా వేసి సన్నని మంట మీద వేయించుకోవాలి. వేయించుకున్న సేమియాను ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.

రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు!

-ఇప్పుడు స్టవ్ మీద బాండీలోనే 2 కప్పుల నీళ్లు పోసి మూతపెట్టి ఒక పొంగు రానివ్వాలి. నీళ్లు పొంగుతున్నప్పుడు వేయించిన సేమియాను ఇందులో వేసి సన్న మంట మీద 5 నిమిషాలు ఉడికించాలి. తర్వాత నీళ్లు మొత్తం డ్రై అయిపోయి సేమియా కూడా బాగా ఉడుకుతుంది.

-ఇప్పుడు ముందుగా కరిగించుకున్న బెల్లం పాకం ఇందులో పోసి కలిపి మూతపెట్టి 5 నిమిషాలు సన్న మంట మీద ఉడికించాలి. సేమియా మొత్తం బెల్లం పాకం పీల్చుకొని పర్ఫెక్ట్ గా వచ్చాక స్టవ్ ఆపేయండి.

-ఇప్పుడు అందులో ముందుగా వేయించిన జీడిపప్పు పలుకులు, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి ఒకసారి బాగా కలపుకోవాలి.

-తర్వాత ఒక పళ్లెంలో ఒక టీస్పూన్ నెయ్యి వేసి ప్లేట్ మొత్తం రుద్ది అందులో ఉడికించిన సేమియా మిశ్రమం మొత్తాన్ని వేసుకొని బాగా సమానంగా స్ప్రెడ్ చేసుకోండి.

-1 గంట తర్వాత దాన్ని ఒక ప్లేట్ లోకి బోర్లించుకొని నచ్చిన షేపులో ముక్కలుగా కట్ చేసుకోండి. అంతే సేమియా స్వీట్ రెడీ.

[ of 5 - Users]
Story first published: Monday, September 7, 2026, 13:55 [IST]
Desktop Bottom Promotion